విశాఖ నావల్ డాక్‌యార్డ్‌లో290 అప్రెంటీస్ పోస్టులు
విశాఖపట్నంలోని
నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్(డీఏఎస్) వివిధ ట్రేడ్‌లలో
అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కొన్ని
విభాగాల్లో ఏడాది(2017-18), మరికొన్ని విభాగాల్లో రెండేళ్లు(2017-19)
శిక్షణ ఇవ్వనుంది.
|
మొత్తం ఖాళీలు: 290 (ఏడాది బ్యాచ్ ఖాళీలు-192; రెండేళ్ల బ్యాచ్ ఖాళీలు-98)
ట్రేడ్‌ల వారీగా ఏడాది బ్యాచ్ ఖాళీలు: ఎలక్ట్రీషియన్-35,ఎలక్ట్రోప్లేటర్-3, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-25, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటనెన్స్-8, ఫిట్టర్- 35, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-8, మెషినిస్ట్-25, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటనెన్స్ -6, పెయింటర్ (జనరల్)-8, ప్యాటర్న్ మేకర్-3, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్- 18, వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-18. ట్రేడ్‌ల వారీగా రెండేళ్ల బ్యాచ్ ఖాళీలు: కార్పెంటర్-25, ఫౌండ్రీమ్యాన్-3, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్(ఎఫ్‌హెచ్‌టీ)-3, మెకానిక్(డీజిల్)-25, పైప్ ఫిట్టర్-16, షీట్ మెటల్ వర్కర్-26. స్టైపెండ్: ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపకారవేతనం ఇస్తారు. విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, కనీసం 65 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. వయసు: 1996 ఏప్రిల్ 1-2003 ఏప్రిల్ 1 మధ్య కాలంలో జన్మించిన జనరల్ అభ్యర్థులు; 1991 ఏప్రిల్ 1-2003 ఏప్రిల్ 1 మధ్య కాలంలో జన్మించిన ఎస్సీ, ఎస్టీలు అర్హులు. రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లలకు అదనంగా రెండేళ్ల సడలింపు ఉంటుంది. శరీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 137 సెం.మీ; బరువు కనీసం 25.4 కేజీలు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష: ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. దరఖాస్తు విధానం: నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్‌ఏపీఎస్)లో భాగంగా వెబ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. తర్వాత ‘అప్రెంటీస్ ప్రొఫైల్’ను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింటౌట్‌కు ధ్రువీకరణ పత్రాల నకళ్లను జత చేసి విశాఖ నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్‌కు పంపాలి. చిరునామా: ది ఆఫీసర్ ఇన్‌చార్జ్ (ఫర్ అప్రెంటీస్‌షిప్), నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్, వీఎం నావల్ బేస్ ఎస్‌వో., పీవో., విశాఖపట్నం, 530014. ముఖ్య తేదీలు :
వెబ్‌సైట్: www.indiannavy.nic.in/content/civilian |
No comments:
Post a Comment