రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 610అసిస్టెంట్ పోస్టులు
రిజర్వు
బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. దేశ వ్యాప్తంగా గల శాఖల్లో వివిధ
విభాగాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
|
||||||||||||||||||||||||||||||||||||
పోస్టు: అసిస్టెంట్
ఖాళీలు: 610 వయోపరిమితి: నవంబరు 8, 2016 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి (నవంబరు 8, 1988 - నవంబరు 7, 1996 మధ్య జన్మించుండాలి). ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. శాఖల వారీగా ఖాళీలు: హైదరాబాద్ -31 ( ఎస్సీ-6, ఎస్టీ-2, ఓబీసీ-8, ఇతరులు-15); బెంగళూరు -35 (ఎస్సీ-6, ఎస్టీ-2, ఓబీసీ-9, ఇతరులు-18); చెన్నై- 25 ( ఎస్సీ-6, ఎస్టీ-0, ఓబీసీ-6, ఇతరులు-13); ముంబై-150 (ఎస్సీ-29, ఎస్టీ-21, ఓబీసీ-25, ఇతరులు-75); తిరువనంతపురం అండ్ కొచ్చి-30 (ఎస్సీ-3, ఎస్టీ- 0, ఓబీసీ-7, ఇతరులు-20); అహ్మదాబాద్ -30 (ఎస్సీ-0, ఎస్టీ-8, ఓబీసీ-7, ఇతరులు-15); భోపాల్ -40 (ఎస్సీ-5, ఎస్టీ-9, ఓబీసీ-4, ఇతరులు-22); భువనేశ్వర్ -20(ఎస్సీ-4, ఎస్టీ-6, ఓబీసీ-0, ఇతరులు-10); చండీఘడ్ -38 (ఎస్సీ-12, ఎస్టీ-0, ఓబీసీ-7, ఇతరులు-19); గువహాటి-27(ఎస్సీ-2, ఎస్టీ-9, ఓబీసీ-2, ఇతరులు-14); జైపూర్- 20 (ఎస్సీ-3, ఎస్టీ-3, ఓబీసీ-4, ఇతరులు-10) ; జమ్మూ-10 (ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-3, ఇతరులు-5); కాన్పూర్ అండ్ లక్నో-52 (ఎస్సీ-13, ఎస్టీ-1, ఓబీసీ-13, ఇతరులు-25); కోల్‌కతా- 35 (ఎస్సీ-11, ఎస్టీ-0, ఓబీసీ-5, ఇతరులు-19); నాగ్‌పూర్-20(ఎస్సీ-0, ఎస్టీ-0, ఓబీసీ-10, ఇతరులు-10); న్యూఢిల్లీ- 25 (ఎస్సీ-5, ఎస్టీ-0, ఓబీసీ-7, ఇతరులు-13); పాట్నా- 22 (ఎస్సీ-3, ఎస్టీ-2, ఓబీసీ-7, ఇతరులు-10) అర్హత: 50 శాతం మార్కులో ఏదేని విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉత్తీర్ణత అయితే చాలు), వర్డ్ ప్రాసెంసింగ్ లో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష : గంట వ్యవధిలో అబ్జెక్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి.
మెయిన్ ఎగ్జామినేషన్ : రెండు గంటల వ్యవధిలో అబ్జెక్టివ్ విధానంలో రెండొందల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
ఇంటర్వ్యూ: ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: అభ్యర్థికి ఈ-మెయిల్ ఐడీ (లేకపోతే తప్పనిసరిగా కొత్త ఈ-మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి), సరైన ఫోన్ నెంబరుండాలి. సంబంధిత వెబ్‌సైట్ నిర్దేశిత నమూనాలో సమాచారాన్ని పూర్తిచేసి అప్లికేషన్ ఫీజుని ఆన్‌లైన్ ద్వారా డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్‌కార్డ్స్/మొబైల్ వాలె ట్స్ ద్వారా చెల్లింవచ్చు. దరఖాస్తు ఫీజు/ఇంటిమేషన్ చార్జీలు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 450; ఎస్సీ/ ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్ (ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే) రూ. 50 చెల్లించాలి. ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్: ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రీజినల్ శాఖల ఆధ్వర్యంలో ప్రీ- ఎగ్జామినేషన్ ట్రైనింగ్‌ని పరిమిత సంఖ్యలో అభ్యర్థులకు అందించనుంది. సంబంధిత కేటగిరీకి చెందినవారు ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ దరఖాస్తులను వెబ్‌సైట్ నుంచి పొంది నిర్దేశిత నమూనాలో పూర్తి చేసి రీజినల్ శాఖల్లో అందజేయాలి. తెలుగు రాష్ట్రాలకు చెందిన రీజినల్ కార్యాలయం చిరునామా: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 6-1-56, సెక్రటేరియట్ రోడ్, సైఫాబాద్, హైదాబాద్-500004 ఆన్‌లై న్ దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 28, 2016 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.rbi.org.in |
No comments:
Post a Comment