Friday, 8 February 2019

SSC JE 2019: జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2019

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజనీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 21 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఫిబ్రవరి 27 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.  

జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2019
విభాగాలు:
ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్.

పరీక్ష ఫీజు: రూ.100. ఎస్‌బీఐ చలానా, నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మహిళా అభ్యర్థులు ఎస్సీ , ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఇప్పటికే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఉన్నవారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేనివారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష (పేపర్-1), కన్వెన్షల్ పరీక్ష (పేపర్-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్.

పరీక్ష విధానం: జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 'పేపర్-1'‌కు 200 మార్కులు, 'పేపర్-2'కు 300 మార్కులు ఉంటాయి.

పేపర్-1లో మొత్తం 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్‌ ఇంటెలిజన్స్‌ & రీజనింగ్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఇంజినీరింగ్ (ఆప్షనల్ సబ్జెక్ట్) నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 0.25 మార్కులు కోత విధిస్తారు. పేప‌ర్-1లో అర్హత‌ సాధించిన‌వారికి పేప‌ర్-2 ప‌రీక్ష నిర్వహిస్తారు.

✦ ఇక పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. పేపర్‌-2 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

ముఖ్యమైన తేదీలు..
✦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:01-02-2019.
✦ దరఖాస్తుకు చివరితేది: 25-02-2019.
✦ ఫీజు చెల్లించడానికి చివరితేది: 27-02-2019.
✦ చలానా జనరేషన్‌కు చివరితేది: 27-02-2019.
✦ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 27-02-2019.
✦ పేపర్-1 పరీక్ష (సీబీటీ) తేది: 23-09-2019.
✦ పేపర్-2 పరీక్ష (కన్వెన్షనల్) తేది: 29-12-2019.

పూర్తి నోటిఫికేషన్

ఆన్‌లైన్ అప్లికేషన్

వెబ్‌సైట్: https://ssc.nic.in/


No comments:

Post a Comment