Tuesday 19 February 2019

RPF PMT PET: కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడి.. వెబ్‌సైట్‌లో ఫిజికల్ ఈవెంట్స్ కాల్ లెటర్లు

  • వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఎంపిక జాబితా
  • ఫిబ్రవరి చివరివారంలో ఫిజికల్ ఈవెంట్లు
రైల్వేలో గ్రూప్-ఈ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులకు ఫిబ్రవరి చివరివారంలో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎడ్యుయరెన్స్ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాతోపాటు.. ఈవెంట్లకు సంబంధించిన కాల్‌లెటర్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో కాల్‌లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. 
కాల్ లెటర్ల కోసం క్లిక్ చేయండి.. 

మొత్తం 8619 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 3619 పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయించగా.. 5000 పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు. డిసెంబరులో రాతపరీక్ష నిర్వహించారు. తాజాగా ఫలితాలను వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి చివరివారంలో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎడ్యుయరెన్స్ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. 
వెబ్‌సైట్

No comments:

Post a Comment