Tuesday, 19 February 2019

రైల్వేలో 1.30 లక్షల ఖాళీలు

దేశ వ్యాప్తంగా దక్షిణ మధ్య‌ రైల్వే సహా ఇతర జోన్లలో 1.30 లక్షల ఉద్యోగాల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ)ల ద్వారా వీటిని భర్తీ చేస్తారు. త్వరలో నియామకాలు చేపడతామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్ జ‌న‌వ‌రిలో ప్రకటించిన విషయం తెలిసిందే.పోస్టులు:* నాన్‌-టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ(ఎన్టీపీసీ)- జూనియ‌ర్ క్ల‌ర్క్ కం టైపిస్ట్‌, అకౌంట్స్ క్ల‌ర్క్ కం టైపిస్ట్‌, ట్రెయిన్ క్ల‌ర్క్‌, క‌మ‌ర్షియ‌ల్ కం టికెట్ క్ల‌ర్క్‌, ట్రాఫిక్ అసిస్టెంట్‌, గూడ్స్ గార్డ్‌, స్టేష‌న్ మాస్ట‌ర్ త‌దిత‌రాలు* పారా మెడిక‌ల్ స్టాఫ్‌- స్టాఫ్ న‌ర్స్‌, ఫార్మాసిస్ట్‌, ఈసీజీ టెక్నీషియ‌న్‌, ల్యాబ్ అసిస్టెంట్‌, ల్యాబ్ సూప‌రింటెండెంట్ త‌దిత‌రాలు.మినిస్టీరియ‌ల్ అండ్ ఐసోలేటెడ్ కేట‌గిరీ- స్టెనోగ్రాఫ‌ర్‌, చీఫ్ లా అసిస్టెంట్‌, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్ త‌దిత‌రాలు.లెవ‌ల్ 1- ట్రాక్ మెయింటైన‌ర్‌, గేట్‌మ్యాన్‌, పాయింట్స్‌మ్యాన్‌, హెల్ప‌ర్‌, పోర్ట‌ర్ త‌దిత‌రాలు.మొత్తం ఖాళీలు: 1,30,000.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఎన్టీపీసీ పోస్టుల‌కు ఫిబ్ర‌వ‌రి 28, పారామెడిక‌ల్- మార్చి 4, మినిస్టీరియ‌ల్‌- మార్చి 8, లెవ‌ల్ 1 ఖాళీల‌కు- మార్చి 12.అర్హ‌త‌, వ‌య‌సు, ఎంపిక త‌దిత‌ర వివ‌రాల‌కు ఎంప్లాయిమెంట్ న్యూస్ (2019, ఫిబ్ర‌వ‌రి 2
3మార్చి 1) చూడ‌వ‌చ్చు.
 

No comments:

Post a Comment