Wednesday, 8 February 2017

TSPSC Notification 7,306 Post

గురుకులాల్లో 7,306 పోస్టుల భర్తీ
Image result for tspsc logo
ప్రకటన విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
టీజీటీకి టెట్ అర్హత తప్పనిసరి
ఫిబ్రవరి 10 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు 
 

 రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో భారీ స్థాయిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 7,306 పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత గురుకులాల్లో అత్యధిక పోస్టులను ఈ ప్రకటన కింద ఇచ్చింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పాఠశాలలు), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, స్టాఫ్ నర్సు, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. గురుకులాల ఉపాధ్యాయ పోస్టుల కోసం ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించింది. టీజీటీ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరని, 20 శాతం వెయిటేజీ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు తెలిపాయి. 

టీజీటీ పోస్టులు అధికం...

 
గురుకులాల ఉపాధ్యాయ ప్రకటనలో అత్యధికంగా 4,362 టీజీటీ పోస్టులు, ఆ తర్వాత 921 పీజీటీ పోస్టులున్నాయి. సొసైటీల వారీగా పోస్టులను తీసుకుంటే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కింద 2136, తెలంగాణ మైనార్టీ గరుకుల విద్యాలయాల సొసైటీ కింద 2080, మహాత్మా జ్యోతిబా పూలె సొసైటీ కింద 1789 పోస్టులను అత్యధికంగా భర్తీ చేస్తున్నారు. గిరిజన గురుకులాల సొసైటీ కింద 994 పోస్టులు, తెలంగాణ గురుకులాల సొసైటీ కింద 307 పోస్టులు పేర్కొన్నారు. గురుకు విద్యాలయాల సొసైటీ కింద భర్తీచేసే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షల విధానం, మార్కులు, సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఆయా వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది.

 
http://tspsc.gov.in/TSPSCWEB0508/indexnew.jsp

No comments:

Post a Comment