ఆర్మీలో 201 పోస్టులు
రక్షణ శాఖ పరిధిలోని ఫీల్డ్ అమ్యునిషన్ డిపోలు, ఆర్డనెన్స్ యూనిట్లు వివిధ కొలువుల నియామకానికి ఉమ్మడిగా ప్రకటన జారీ చేశాయి.
|
ఖాళీలు: ఫైర్‌మ్యాన్-3,
టెలిఫోన్ ఆపరేటర్-1, ట్రేడ్స్‌మ్యాన్ మేట్-171, సఫాయివాలా-2, సివిలియన్
మోటర్ డ్రైవర్-2; ఎల్‌డీసీ-11, స్టెనోగ్రాఫర్-1, మెటీరియల్ అసిస్టెంట్-10.
వేతనం: ఫైర్‌మ్యాన్, డ్రైవర్, ఎల్‌డీసీ, స్టెనోగ్రాఫర్: రూ.19,900; టెలిఫోన్ ఆపరేటర్: రూ.21,700; ట్రేడ్స్‌మ్యాన్, సఫాయివాలా: రూ. 18,000; మెటీరియల్ అసిస్టెంట్: రూ.29,200. విద్యార్హత: ఫైర్‌మ్యాన్, టెలిఫోన్ ఆపరేటర్, ట్రేడ్స్‌మ్యాన్, సఫాయివాలా, డ్రైవర్‌కు పదో తరగతి; ఎల్‌డీసీ, స్టెనోగ్రాఫర్‌కు ఇంటర్; మెటీరియల్ అసిస్టెంట్‌కు డిగ్రీ (లేదా) మెటీరియల్ మేనేజ్‌మెంట్/ఇంజనీరింగ్‌లో డిప్లొమా. వయసు: మార్చి 3 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 25 ఏళ్ల లోపు (మెటీరియల్ అసిస్టెంట్‌కు 27 ఏళ్ల లోపు) ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: శారీరక సామర్థ్య పరీక్ష/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష శారీరక సామర్థ్య పరీక్ష/స్కిల్ టెస్ట్: పోస్టును బట్టి మారుతుంది. రాత పరీక్ష: 120 నిమిషాల (2 గంటల) వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 150 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు (150 మార్కులు) సమాధానాలు గుర్తించాలి. ఇందులో జనరల్ ఇంటలిజెన్స్, రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు; న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25; జనరల్ ఇంగ్లిష్ నుంచి 50; జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఆయా పోస్టులకు పేర్కొన్న విద్యార్హతలను బట్టి ప్రశ్నల స్థాయి మారుతుంది. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తును ‘కమాండెంట్, 15 ఎఫ్‌ఏడీ, 909715, కేరాఫ్ 56 ఏపీవో’ అనే చిరునామాకు పంపాలి. దరఖాస్తు చివరి తేది: మార్చి 3, 2017 |
No comments:
Post a Comment