సీఆర్‌పీఎఫ్‌లో 2945 కానిస్టేబుల్ పోస్టులు
సెంట్రల్
రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో
కానిస్టేబుల్ (టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్) ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ
చేసింది.
|
ట్రేడ్‌ల వారీగా ఖాళీలు:
ఏపీ: డ్రైవర్-75, మోటర్ వెహికల్ మెకానిక్ (ఎంఎంవీ- ఫిట్టర్)-20, బగ్లర్-10, టైలర్-4, కోబ్లర్-3, గార్డెనర్-1, పెయింటర్-1, కుక్-5, వాటర్ క్యారియర్-4, వాషర్-4, సఫాయీ కర్మచారి-5, బార్బర్-5. తెలంగాణ: డ్రైవర్-50, మోటర్ వెహికల్ మెకానిక్ (ఎంఎంవీ-ఫిట్టర్)-14, బగ్లర్-7, టైలర్-4, కోబ్లర్-3, గార్డెనర్-1, పెయింటర్-1, బ్రాస్ బ్యాండ్-1, కుక్-7, వాటర్ క్యారియర్-3, వాషర్-3, సఫాయీ కర్మచారి-4, బార్బర్-2. వేతనం: రూ.21,700-50,000 పేస్కేల్+అలవెన్సులు ఇస్తారు. అర్హతలు: డ్రైవర్‌కు పదో తరగతి, ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్(హెవీ) డ్రైవింగ్ లెసైన్స్; మెకానిక్‌కు పదో తరగతి, మోటర్ వెహికల్ మెకానిక్ ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ సర్టిఫికెట్, ఏడాది అనుభవం (లేదా) సంబంధిత ట్రేడ్‌లో మూడేళ్ల అప్రెంటీస్‌షిప్, ఏడాది అనుభవం; మిగతా అన్ని ట్రేడ్‌లకు పదో తరగతి, సంబంధిత పనుల్లో నైపుణ్యం. వయసు(2017 జనవరి 1 నాటికి): డ్రైవర్‌కు 21-27 ఏళ్లు; మిగతా అన్ని పోస్టులకు 18-23 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. శారీరక ప్రమాణాలు...
పీఈటీ: హైట్ బార్‌పై నుంచి దూకాలి (పురుషులు మాత్రమే). తర్వాత 5 కి.మీ. దూరం 24 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కి.మీ. 8.30 నిమిషాల్లో చేరుకోవాలి. ఈ పరీక్షను డ్రైవర్, మెకానిక్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, మాలి, బగ్లర్ పోస్టులకే నిర్వహిస్తారు. మిగిలిన పోస్టులకు ఒక మైలు (1.6 కి.మీ) దూరాన్ని పురుషులు 10 నిమిషాల్లో, మహిళలు 12 నిమిషాల్లో చేరుకోవాలి. పీఎస్‌టీ: ఎత్తు, బరువు, ఛాతీ వెడల్పు పరీక్షించి రాత పరీక్షకు అనుమతిస్తారు. రాత పరీక్ష: 120 నిమిషాల్లో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు (100 మార్కులు) జవాబులు గుర్తించాలి. పార్ట్-1లో టెన్త్ క్లాస్ నాలెడ్జ్‌పై 40 ప్రశ్నలు, పార్ట్-2లో ట్రేడ్ నాలెడ్జ్‌పై 60 ప్రశ్నలిస్తారు. జనరల్ అభ్యర్థులు కనీసం 35 శాతం; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 33 శాతం మార్కులు సాధించాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. ట్రేడ్ టెస్ట్: ప్రాక్టికల్, రిటన్ ట్రేడ్ స్కిల్స్‌పై 50 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతిఒక్కరూ కనీసం 20 మార్కులు సాధించాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. గమనిక: దివ్యాంగులు అనర్హులు. మహిళలను వారికి కేటాయించిన ఉద్యోగాలకే పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్య తేదీలు :
వెబ్‌సైట్: www.crpfindia.com (లేదా) www.crpf.nic.in |
No comments:
Post a Comment