Sunday, 19 February 2017

'బీసీ గురుకుల’ పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో ప్రవేశాలు

'బీసీ గురుకుల’ పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో ప్రవేశాలు



Adminissionsమహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2017-18 విద్యా సంవత్సరంలో 6, 7 తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. తెలంగాణలోని 31 జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: 6వ తరగతిలో ప్రవేశానికి 2016-17లో 5వ తరగతి చదువుతున్నవారు; 7వ తరగతిలో ప్రవేశానికి 6వ తరగతి చదువుతున్నవారు అర్హులు. 2015-16, 2016-17 విద్యా సంవత్సరాల్లో నిరవధికంగా విద్యను అభ్యసించి ఉండాలి.
వార్షికాదాయం: గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.లక్షన్నర లోపు; పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.రెండు లక్షల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: 100 మార్కులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం: రూ.50
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 28, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: mjptbcwreis.cgg.gov.in

No comments:

Post a Comment