నోరూరించే పాకం...
తియ్యని
పదార్థాలంటే ఇష్టపడని వారుండరు. వాటిని చూస్తే చాలు నోట్లో నీళ్ళూరక
తప్పవు.. అలాంటి నోరురూరించే మైసూరు పాక్‌లు ఈ వారం మీ కోసం...
మైసూరు పాక్
కావలిసిన పదార్థాలు: శనగపిండి-ఒక కప్పు, చక్కెర-ఒక కప్పు, నెయ్యి-ఒక కప్పు.
తయారీ విధానం: ఒక పాత్రలో రెండు చెంచాల నెయ్యి వేసి దాంట్లోనే శనగపిండిని వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరో పాత్రలో చక్కెర పాకం తయారు చేసుకోవాలి. చక్కెర పాకం చిక్కబడకుండా తీగపాకం వచ్చేలా చూసుకోవాలి. ఆ తరువాత దీంట్లో వేయించిపెట్టుకున్న శనగపిండిని కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టుకుని శనగపిండిని వేసి బాగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మరో పాత్రకి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో 20 నిమిషాల పాటు కదలకుండా పెట్టుకోవాలి. ఇలా చేసిన తరువాత మీకిష్టమైన ఆకారంలో కట్ చేసుకుంటే సరిపోతుంది.
పాలక్ మైసూరు పాక్
కావలిసిన పదార్థాలు: మిల్క్ పౌడర్-ఒక కప్పు, మైదా పిండి-సగం కప్పు చక్కెర-ఒక కప్పు, నెయ్యి -ఒక కప్పు, ఉప్పు చిటికెడు.
తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో మిల్క్ పౌడర్‌ను, మైదా పిండి, చిటికెటు ఉప్పును వేసుకుని బాగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మరో పాత్రలో చక్కెర పాకం పెట్టుకోవాలి. చక్కెర పాకం బాగా చిక్కబడకుండా తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇలా చేస్తున్న క్రమంలో స్టవ్‌ను సిమ్‌లో పెట్టుకుని ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని చక్కెర పాకంలో వేసి బాగా కలుపుతూ ఉండాలి. పాకంలోనే నెయ్యిని వేసి బాగా కలపాలి. మిల్క్ పౌడర్ నెయ్యిని మొత్తంగా పీల్చుకునే వరకు కలపాలి. ఇలా చేసిన తర్వాత ఖాళీగా ఉన్న గిన్నెకు నెయ్యి పూసి దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసుకుని వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుని, గంట పాటు కలపకుండా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది.
గుల్ల మైసూరు పాక్
కావలిసిన పదార్థాలు: శనగపిండి-ఒక కప్పు, చక్కెర-రెండు కప్పులు, నెయ్యి-ఒక కప్పు, మంచి నూనె-ఒక కప్పు, ఒక చెంచా యాలకుల పొడి.
తయారీ విధానం: ఒక పాత్రలో చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసేటప్పుడు స్టవ్‌ను సిమ్ పెట్టుకుని తీగ పాకం వచ్చేలా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత పాకంలో శనగపిండిని వేసి నెమ్మదిగా పది నిమిషాల పాటు కలపాలి. ఆ తరువాత మరో పాత్రలో ఒక కప్పు నూనె, ఒక కప్పు నెయ్యి వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆ తరువాత శనగపిండిలో వేడిగా ఉన్న నూనెను దాంట్లో వేసి 15 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్న సమయంలోనే యాలకుల పొడి వేసి కలిపి నెయ్యి పూసి పెట్టుకున్న పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసి, వేడిగా ఉన్నప్పుడే చాక్‌తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత పది నిమిషాలు కదలకుండా ఉంచుకుంటే గుల్ల మైసూరు పాక్ తయారైపోతుంది.
కృష్ణ మైసూరు పాక్
కావలిసిన పదార్థాలు: శనగపిండి-ఒక కప్పు, చక్కెర-ఒక కప్పు, నెయ్యి-ఒక కప్పు, సగం చెంచా యాలకులపొడి, సగం చెంచా బాదం పొడి.
తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో సగం చెంచా నెయ్యిలో శనగపిండి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా చేసుకున్న తర్వాత మరో పాత్రలో సన్నని మంటపై చక్కెర పాకంను తయారు చేసుకోవాలి. పాకం పూర్తిగా చిక్కబడకుండా తీగపాకంలో ఉన్నప్పుడే వేయించు ఉంచుకున్న శనగపిండిని దాంట్లో వేసి పది నిమిషాల పాటు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమంలోనే యాలకులపొడి, బాదం పొడి వేసి, నెయ్యి వేసి పాకం మొత్తంగా నెయ్యిని పీల్చుకునే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మరో గిన్నెకు నెయ్యి పూసి వేడిగ ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే సరిపోతుంది.
నెయ్యి మైసూరు పాక్
కావలిసిన పదార్థాలు: శనగపిండి-ఒక కప్పు, చక్కెర-ఒక కప్పు, నెయ్యి-రెండు కప్పులు. ఒక చెంచా మంచి నూనె.
తయారీ విధానం: ఈ మైసూరు పాక్‌లను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక పాత్రలో ఒక చెంచా మంచి నూనె వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే శనగపిండిని వేసి కాస్త రంగు మారే వరకు వేయించాలి. ఇలా చేసిన తరువాత మరో పాత్రలో చక్కెర పాకం పట్టుకోవాలి. చక్కెర పాకం చిక్కబడకుండా తీగ పాకంలో ఉన్నప్పుడే శనగపిండి వేసి ఉండలు రాకుండా మృదువుగా ఉండేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత దాంట్లోనే నెయ్యిని వేసి బాగా కలపాలి. ఇలా నెయ్యిని శనగపిండి పీల్చుకునే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తరువాత మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు కలపకుండా ఉంచి గోరు వెచ్చగా ఉన్నప్పుడే కట్ చేస్తే సరిపోతుంది. ఇవి చాలా మెత్తగా, తీపిగా ఉంటాయి.

No comments:
Post a Comment