టీఎస్‌పీఎస్సీ వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టులకు నోటిఫికేషన్‌లను విడుదల చేసింది.
|
రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్లు :
పోస్టుల సంఖ్య: 42 (ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీల్లో-26, బీసీ వెల్ఫేర్ కాలేజీల్లో-16) అర్హత: డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్), లైబ్రరీ సైన్స్‌లో పీజీ/తత్సమానం. (కనీసం 50 శాతం మార్కులు) రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో లైబ్రేరియన్లు : పోస్టుల సంఖ్య:21 (ఓసీ-12, ఎస్సీ-4, ఎస్టీ-2, బీసీ(ఏ)-2, బీసీ(బీ)-1. అర్హత: లైబ్రరీ సైన్స్‌లో పీజీ/తత్సమానం, నెట్/స్లెట్ ఉత్తీర్ణత. పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్/స్లెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ఫిజికల్ డెరైక్టర్లు : పోస్టుల సంఖ్య: 21 (ఓసీ-12, ఎస్సీ-4, ఎస్టీ-2, బీసీ(ఎ)-2, బీసీ(బీ)-1) అర్హత: ఎంపీఈడీ, నెట్/స్లెట్ ఉత్తీర్ణత, పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్/స్లెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డెరైక్టర్లు : పోస్టుల సంఖ్య: 8 అర్హత: బీపీఈడీ/బీఎస్సీ(హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), డిగ్రీ(స్పోర్ట్స్). రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాలు : పోస్టుల సంఖ్య: 6 అర్హత: పీజీ(ఎంఏ/ఎంఎస్సీ/ఎంకామ్), బీఈడీ, కనీసం ఎనిమిదేళ్ల బోధనానుభవం (ఐదేళ్లు జూనియర్ లెక్చరర్‌గా/పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, మూడేళ్లు హెడ్ మాస్టర్‌గా/ ప్రిన్సిపల్‌గా అనుభవం ). కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. గమనిక: పైన పేర్కొన్న ఐదు రకాల పోస్టులకు.. వయో పరిమితి: 18-44 ఏళ్లు (రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌కి కనీస వయసు 34 ఏళ్లు). ఎంపిక విధానం: ప్రాథమిక, ప్రధాన రాత పరీక్షలు.ఇంటర్వ్యూ/డెమో/వైవా వోస్. దరఖాస్తుకు చివరి తేది: జూన్ 24, 2017 ప్రాథమిక పరీక్ష తేది: జూలై 16, 2017 ప్రధాన పరీక్ష తేదీ : ఆగస్టు 12 లేదా 13, 2017) రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాలు పోస్టుల సంఖ్య: 30((ఓసీ-14, ఎస్సీ-5, ఎస్టీ-2, బీసీ(ఎ)-3, బీసీ(బీ)-2, బీసీ (సీ)-1), బీసీ(డి)-1, బీసీ(ఇ)-1, దివ్యాంగులకు-1)) అర్హత: పీహెచ్‌డీ, ప్రభుత్వ/ఎయిడెడ్/రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో రెగ్యులర్ ప్రిన్సిపల్‌గా అనుభవం (లేదా) డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా ఐదేళ్ల అనుభవం (లేదా) జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఐదేళ్ల అనుభవం (లేదా) జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా పదేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. వయసు: కనీసం 34 ఏళ్లు. గరిష్టం 44 ఏళ్ల లోపు. ఎంపిక విధానం: అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్(ఏపీఐ)లో కనీస స్కోర్‌తోపాటు అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్‌కి 20 శాతం వెయిటేజీ; రీసెర్చ్ పెర్ఫార్మెన్స్, క్వాలిటీ ఆఫ్ పబ్లికేషన్స్‌కి 40 శాతం వెయిటేజీ; డొమైన్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్‌కి 20 శాతం, ఇంటర్వ్యూకి 20 శాతం వెయిటేజీ ఇస్తారు. దరఖాస్తు చివరి తేది: జూన్ 24, 2017. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘ప్రొఫెసర్లు’ పోస్టుల సంఖ్య: ప్రొఫెసర్-2, అసోసియేట్ ప్రొఫెసర్-4, అసిస్టెంట్ ప్రొఫెసర్-12, లైబ్రేరియన్-1. అర్హత: ప్రొఫెసర్‌కు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ, కనీసం పదేళ్ల బోధనానుభవం/పరిశోధన అనుభవం. అసోసియేట్ ప్రొఫెసర్‌కు పీహెచ్‌డీ, కనీసం ఎనిమిదేళ్ల బోధన/పరిశోధన అనుభవం. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు పీజీ, నెట్‌లో ఉత్తీర్ణత, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్‌లో ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయి ఉండాలి. పైన పేర్కొన్న మూడు రకాల పోస్టులకూ అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్(ఏపీఐ)లో కనీస స్కోర్లు ఉండాలి. పీహెచ్‌డీ అభ్యర్థులకు నెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వయసు: గరిష్ట వయో పరిమితి లేదు. ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్, రీసెర్చ్ పెర్ఫార్మెన్స్, డొమైన్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు చివరి తేదీ: జూలై 11, 2017. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఉద్యోగాలు పోస్టుల సంఖ్య: 4 అర్హత: డిగ్రీ(మెకానికల్/ప్రొడక్షన్/పవర్ ప్లాంట్/మెటలర్జికల్ ఇంజనీరింగ్). సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం. వయసు: 18-38 ఏళ్లు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేది : జూలై 11, 2017 రాత పరీక్ష తేది: ఆగస్టు 5,6 తేదీల్లో, 2017 పైవన్నీ పోస్టులకు పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.tspsc.gov.in |
No comments:
Post a Comment