గురుకుల పాఠశాలల వారీ ఖాళీలు: గురుకుల
పాఠశాలలు-14; సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు-43, మహాత్మా జ్యోతిబా పూలే
బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు -43, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు
-188; గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు -16. ఈ మొత్తం పోస్టులను
బాలురు/బాలికల గురుకుల పాఠశాలల వారీగా.. బాలుర గురుకుల పాఠశాలలు -7, బాలుర
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు -21, బాలుర బీసీ సంక్షేమగురుకుల పాఠశాలలు
-21, బాలుర మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు -92, బాలుర గిరిజన సంక్షేమ
గురుకుల పాఠశాలలు (ఏజెన్సీ)-1, బాలుర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు
(నాన్-ఏజెన్సీ)-5; బాలికల గురుకుల పాఠశాలలు-7, బాలికల సాంఘిక సంక్షేమ
గురుకుల పాఠశాలలు -22, బాలికల బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-22, బాలికల
మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-96, బాలికల గిరిజన సంక్షేమగురుకుల
పాఠశాలలు (ఏజెన్సీ)-2, బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు
(నాన్-ఏజెన్సీ)-8 పోస్టులు ఉన్నాయి.
గమనిక: బాలికల విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వేతనం: గిరిజన
సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని ప్రిన్సిపల్ పోస్టులకు రూ.42,490-96,110;
మిగిలిన గురుకుల పాఠశాలల్లోని ప్రిన్సిపల్ పోస్టులకు రూ.40,270-93,780.
అర్హతలు: 50 శాతం
మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ
అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. అలాగే మొత్తం 8 ఏళ్ల బోధనానుభవం
ఉండాలి. ఇందులో 5 ఏళ్లు పీజీటీ/జేఎల్‌గా, మూడేళ్లు హెడ్
మాస్టర్/ప్రిన్సిపల్‌గా పనిచేసి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో
పరిజ్ఞానం అభిలషణీయం.
వయోపరిమితి: 2017,
జూలై 1 నాటికి 34-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు
నిబంధనలు అనుసరించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. తెలంగాణ
రాష్ట్రానికి చెందిన ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్/నిరుద్యోగ అభ్యర్థులకు
ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్
(ఆబ్జెక్టివ్ విధానం), ఇంటర్వ్యూ/డెమానిస్ట్రేషన్/వైవా-వోస్. ప్రిలిమినరీ
ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను 1:15 నిష్పత్తిలో జాబితా
ప్రకారం మెయిన్ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల
మెరిట్ జాబితా నుంచి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను
డాక్యుమెంట్‌వెరిఫికేషన్, ఇంటర్వ్యూ/డెమానిస్ట్రేషన్/వైవా-వోస్‌కు
పిలుస్తారు.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ
(స్క్రీనింగ్ టెస్ట్) ఎగ్జామినేషన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష
ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ఫ్రొఫిషియెన్సీ
ఇన్ ఇంగ్లిష్ విభాగాల నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. మెయిన్
ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)లో పేపర్-1 (సంబంధిత శిక్షణ అంశం, స్కూల్
మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్)లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి.
పేపర్-2 (విద్యాహక్కు చట్టం, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్, స్కూల్
ఆర్గనైజేషన్, టీచర్ ఎంపవర్‌మెంట్, చైల్డ్ డెవలప్‌మెంట్)లో 150 ప్రశ్నలు 150
మార్కులకు ఉంటాయి. అనంతరం ఇంటర్వ్యూ/డెమో/వైవా-వోస్ 30 మార్కులకు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 6, 2017.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 24, 2017.
పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-జూలై 16,2017.
మెయిన్ ఎగ్జామినేషన్ : ఆగస్టు 12/13, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.tspsc.gov.in .
No comments:
Post a Comment