Thursday 8 June 2017

తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో 541 పోస్టులు

తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో 541 పోస్టులు

రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది.
Jobs ఖాళీలు: ఓసీ-220, బీసీ(ఏ)-33, బీసీ(బీ)-48, బీసీ(సీ)-7, బీసీ(డీ)-34, బీసీ(ఇ) -23, ఎస్సీ-75, ఎస్టీ-77, దివ్యాంగులు-24.
వేతనం: రూ.19,500-58,330.
అర్హత: రెండేళ్ల యానిమల్ హజ్బెండ్రీ పాలిటెక్నిక్ ఉత్తీర్ణత (లేదా) డైరీయింగ్ అండ్ పౌల్ట్రీ సెన్సైస్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ వొకేషనల్ కోర్సు (లేదా) రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా (లేదా) ఇంటర్ వొకేషనల్ (మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్).
వయసు: 2017 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు. గరిష్టం 43 ఏళ్ల లోపు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 150 నిమిషాల వ్యవధిలో నిర్వహించే పేపర్-1 పరీక్షలో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు (150 మార్కులు) జవాబులు గుర్తించాలి. పేపర్-2 పరీక్షనూ 150 నిమిషాల వ్యవధిలోనే నిర్వహిస్తారు. ఇందులోనూ 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు (150 మార్కులు) జవాబులు గుర్తించాలి. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ నుంచి; పేపర్-2లో యానిమల్ హజ్బెండ్రీ పాలిటెక్నిక్/ఇంటర్ వొకేషన్ కోర్సు (డైరీ/పౌల్ట్రీ) నుంచి ప్రశ్నలిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తు రుసుం: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామ్ ఫీజు రూ.80. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, నిరుద్యోగులకు ఎగ్జామ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
దరఖాస్తు ప్రారంభ తేది : జూన్ 6, 2017
దరఖాస్తు చివరి తేది : జూన్ 24, 2017
పరీక్ష తేది : జూలై 23, 2017.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు : 7
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీ)(లేదా) పీజీ/పీజీ డిప్లొమా(మైక్రోబయాలజీ/పారాసైటాలజీ/ఎపిడెమియాలజీ/వైరాలజీ/ఇమ్యునాలజీ/పాథాలజీ) (లేదా) పీజీ(వెటర్నరీ సైన్స్ విత్ బయో టెక్నాలజీ) (లేదా) పీజీ (వెటర్నరీ సైన్స్ విత్ పబ్లిక్ హెల్త్ )
వయసు: కనీసం 18 ఏళ్లు. గరిష్టం 40 ఏళ్ల లోపు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తుకు చివరి తేది : జూన్ 24, 2017
రాత పరీక్ష తేదీ : ఆగస్టు 5, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in

No comments:

Post a Comment