Thursday 8 June 2017

తెలంగాణ ఉమెన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 546 లెక్చరర్ పోస్టులు

తెలంగాణ ఉమెన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 546 లెక్చరర్ పోస్టులు

తెలంగాణలోని ఉమెన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.
Jobsకాలేజీల వారీగా ఖాళీలు: బీసీ వెల్ఫేర్ కాలేజీల్లో-36, సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో-510).
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: తెలుగు: 2+60; ఇంగ్లిష్: 4+60; ఎకనామిక్స్: 2+15; హిస్టరీ: 2+15; పొలిటికల్ సైన్స్: 2+15; పొలిటికల్ సైన్స్: 2+15; కామర్స్: 4+89; మ్యాథ్స్: 3+30; ఫిజిక్స్: 2+28; కెమిస్ట్రీ: 3+35; బోటనీ: 2+30; జువాలజీ: 2+30; మైక్రోబయాలజీ: 1+30; ఎలక్ట్రానిక్స్: 1; జియాలజీ: 1; జెనెటిక్స్: 1; ఫుడ్ సైన్స్: 1; బయోకెమిస్ట్రీ: 1+1; బయోటెక్నాలజీ: 1+1; కంప్యూటర్ సైన్స్: 3+31; స్టాటిస్టిక్స్: 2+30; న్యూట్రిషన్ అండ్ డెటైటిక్స్: 1; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్: 1; జర్నలిజం: 1; సైకాలజీ: 1; సోషియాలజీ: 1; బిజినెస్ అడ్మినిస్ట్రేషన్: 1.
వేతనం: రూ.40,270-93,780.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ(కనీసం 55 శాతం మార్కులు/7 పాయింట్ స్కేల్‌లో బీ గ్రేడ్), నెట్/స్లెట్ ఉత్తీర్ణత. పీహెచ్‌డీ అర్హత కలిగిన అభ్యర్థులకు నెట్/స్లెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కనీసం 50 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది. 1991 సెప్టెంబర్ 19కి ముందు పీజీ పాసై పీహెచ్‌డీ అర్హత కలిగిన అభ్యర్థులకూ పీజీలో 50 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది.
వయసు: 2017 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు. గరిష్టం 44 ఏళ్ల లోపు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: మెయిన్ ఎగ్జామ్ మార్కులు (300), ఇంటర్వ్యూ/డెమో/వైవా వోస్ మార్కుల (30) ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రధాన పరీక్షకు ముందు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు.
ప్రాథమిక పరీక్ష: ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. 150 నిమిషాల(రెండున్నర గంటల) వ్యవధిలో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు (150 మార్కులు) జవాబులు గుర్తించాలి. ప్రశ్నలు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ నుంచి వస్తాయి.
ప్రధాన పరీక్ష: లాంగ్వేజ్ సబ్జెక్టులు మినహా మిగిలినవాటికి ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. 150 నిమిషాల వ్యవధిలో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు (300 మార్కులు) జవాబులు గుర్తించాలి. ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టుల నుంచి పీజీ స్థాయిలో వస్తాయి.
ఇంటర్వ్యూ/డెమో/వైవా వోస్: 30 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తు రుసుం: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామ్ ఫీజు రూ.120. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, నిరుద్యోగులకు ఎగ్జామ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: జూన్ 6, 2017
దరఖాస్తు చివరి తేది : జూన్ 24, 2017
ప్రిలిమినరీ పరీక్ష తేది : జూలై 16, 2017
ప్రధాన పరీక్ష తేది: ఆగస్టు 12 లేదా 13, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in

No comments:

Post a Comment