Thursday 8 June 2017

273 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు

273 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు

సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో 273 డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobs పూర్వ జిల్లాల వారీ ఖాళీలు: ఆదిలాబాద్-25, కరీంనగర్-37, వరంగల్-30, ఖమ్మం-25, రంగారెడ్డి-24, నిజామాబాద్-24, మహబూబ్‌నగర్-35, మెదక్-24, నల్గొండ-34, హైదరాబాద్-15.
వేతనం: రూ.22,600-66,330.
అర్హతలు: పదోతరగతితోపాటు డ్రాట్స్‌మ్యాన్ (సివిల్) ట్రేడ్ విభాగంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ కోర్సులో ఒక సబ్జెక్టుగా సర్వేయింగ్ కచ్చితంగా ఉండాలి. లేదా ఐటీఐ (సివిల్ డ్రాట్స్‌మ్యాన్)/ ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
2017, జూలై 1 నాటికి 18-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ/బీసీ, నిరుద్యోగ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజులో మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తు రుసుములను ఎస్‌బీఐ ఈ-పే విధానంలో చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో
ఎంపిక విధానం: ఆన్‌లైన్/ఓఎంఆర్ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, సివిల్ (ఐటీఐ ట్రేడ్) విభాగాల్లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో మార్కు ఉంటుంది. సమయం రెండున్నర గంటలు.
పరీక్ష సిలబస్: జనరల్ నాలెడ్జ్‌లో.. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రిడే లైఫ్, ఎన్విరాన్‌మెంటల్ ఇస్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్‌స్టిట్యూషన్: ఇండియన్ పొలిటికల్ సిస్టం అండ్ గవర్నమెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
సివిల్ (ఐటీఐ ట్రేడ్)లో.. ఇంజనీరింగ్ డ్రాయింగ్, బిల్డింగ్ మెటీరియల్స్, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్, కాన్‌క్రెటింగ్, సర్వేయింగ్, లెవెలింగ్ అండ్ బేసిక్స్ ఆఫ్ మోడర్న్ సర్వేయింగ్, రోడ్స్, రైల్వేస్ అండ్ బ్రిడ్జెస్, ఇరిగేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బిల్డింగ్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్, బిల్డింగ్ ఎస్టిమేషన్ విభాగాల్లోని అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 6, 2017.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 24, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in

No comments:

Post a Comment