తెలంగాణ గురుకులాల్లో 152 జూనియర్ లెక్చరర్ పోస్టులు
తెలంగాణలోని గురుకులాల్లో 152 జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులకు టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
|
గురుకులాల వారీగా ఖాళీలు: మహాత్మాజ్యోతిబా
పూలే బీసీ సంక్షేమ గురుకులాలు-105; తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాలు-41;
గురుకులాలు-6. ఈ మొత్తం పోస్టుల్లో బాలుర గురుకులాలకు-4, గిరిజన బాలుర
గురుకులాలు-22, బీసీ సంక్షేమ బాలుర గురుకులాలు-39; బాలికల గురుకులాలు-2,
గిరిజన బాలికల గురుకులాలు-19, బీసీ సంక్షేమ బాలికల గురుకులాలకు-66
కేటాయించారు.
గమనిక: బాలికల విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. వేతనం: బీసీ సంక్షేమ/గిరిజన గురుకులాల జేఎల్ పోస్టులకు రూ.37,100-91,450; మిగిలిన గురుకులాల్లోని జేఎల్ పోస్టులకు రూ.35,120-87,130. అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బీఈడీ చేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. వయోపరిమితి: 2017, జూలై 1 నాటికి 18-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్/నిరుద్యోగ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం), ఇంటర్వ్యూ/డెమానిస్ట్రేషన్/వివా-వోస్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను 1:15 నిష్పత్తిలో జాబితా ప్రకారం మెయిన్ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ జాబితా నుంచి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ/డెమానిస్ట్రేషన్/వివా-వోస్‌కు పిలుస్తారు. పరీక్ష విధానం: ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) ఎగ్జామినేషన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ఫ్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్‌లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)లో పేపర్-1లో కామన్ సిలబస్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. పేపర్-2లో సంబంధిత సబ్జెక్టు (పీజీ స్థాయి)లో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. అనంతరం ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 6, 2017. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 24, 2017. పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-జూలై 16, 2017. మెయిన్ ఎగ్జామినేషన్ : ఆగస్టు 12/13, 2017. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.tspsc.gov.in |
No comments:
Post a Comment