Thursday 8 June 2017

463 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు

463 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు

వివిధ ప్రభుత్వ శాఖల్లోని 463 ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.
Jobs పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ).
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్.
శాఖల వారీగా ఖాళీలు: ఐ అండ్ సీఏడీలో.. ఏఈఈ (సివిల్)-204, ఏఈఈ (ఎలక్ట్రికల్)-120; ఆర్ అండ్ బీలో.. ఏఈఈ (ఎలక్ట్రికల్)-11, ఏఈఈ (సివిల్)-106; ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో.. ఏఈఈ (సివిల్/మెకానికల్)-21, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో.. ఏఈఈ (మెకానికల్)-1.
వేతనం: రూ.37,100-91,450.
అర్హతలు: సంబంధిత విభాగాలను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ(బీఈ/బీటెక్).
వయోపరిమితి: 2017, జూలై 1 నాటికి 18-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలను అనుసరించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, నిరుద్యోగులకు ఎగ్జామ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్/ఓఎంఆర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ. రాతపరీక్ష (ఆన్‌లైన్/ఓఎంఆర్)లో క్వాలిఫై అయిన వారిలో 1:2 నిష్పత్తితో ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. రాతపరీక్ష 450 మార్కులకు రెండు పేపర్లుగా ఉంటుంది. ఇందులో పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ విభాగాల నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. పేపర్-2లో సివిల్ ఇంజనీరింగ్ (డిగ్రీ లెవెల్)/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (డిగ్రీ లెవెల్)/మెకానికల్ ఇంజనీరింగ్ (డిగ్రీ లెవెల్)లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్ష అనంతరం ఇంటర్వ్యూ 50 మార్కులకు నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 6, 2017.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 11, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in

No comments:

Post a Comment