Monday, 17 October 2016

1800 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

1800 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో 1,800 హోంగార్డు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Education Newsమొత్తం ఖాళీలు: 1800
సైబరాబాద్ కమిషనరేట్: 900
రాచకొండ కమిషనరేట్: 900

ఒక్కో కమిషనరేట్‌లో ఉన్న ఖాళీల వివరాలు
జనరల్ విధులు
500
డీజీ రిజర్వ్
225
డ్రైవర్(ఎల్‌ఎంవీ)
100
కంప్యూటర్ ఆపరేటర్
20
సీసీ కెమెరా టెక్నీషియన్
20
కుక్
8
శానిటేషన్/మెయింటెనెన్స్ స్టాఫ్
5
స్వీపర్
5
ధోబీ
2
బార్బర్
3
ప్లంబర్
2
పెయింటర్
3
ఆటో ఎలక్ట్రీషియన్
2
ఆటో మెకానిక్
5
మొత్తం
900

అర్హతలు
  • ఆయా కమిషనరేట్ల పరిధిలో నివసించే స్థానికులు అర్హులు.
  • 2016 సెప్టెంబర్ 30 నాటికి వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ‘ఏ కేటగిరీ’ పోస్టులకు పదో తరగతి, ‘బీ కేటగిరీ’కి ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • పురుషులు కనీసం 165 సెం.మీ. ఎత్తు(ఎస్టీలు 160 సెం.మీ.), మహిళా అభ్యర్థులు 150 సెం.మీ. ఎత్తు(ఎస్టీలు 145 సెం.మీ.) ఉండాలి.

‘ఎ’ కేటగిరీ పోస్టులు: జనరల్ విధులు
‘బీ’ కేటగిరీ పోస్టులు: డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, సీసీ కెమెరా టెక్నీషియన్, కుక్, శానిటేషన్/మెయింటెనెన్స్ స్టాఫ్, స్వీపర్, ధోబీ, బార్బర్, ప్లంబర్, పెయింటర్, ఆటో ఎలక్ట్రీషియన్, ఆటో మెకానిక్

దరఖాస్తు విధానం
అక్టోబర్ 15 నుంచి 25 వరకు(పని దినాల్లో) దరఖాస్తులు విక్రయిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు రూ.25 చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి: గచ్చిబౌలిలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్
రాచకొండ కమిషనరేట్ పరిధి: అంబర్‌పేటలోని రాచకొండ సీఏఆర్ హెడ్-క్వార్టర్స్

జత చేయాల్సిన ధ్రువపత్రాలు
  • ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 సెట్ల జిరాక్స్ ప్రతులు, 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తేవాలి.
  • దరఖాస్తుతో పాటు బర్త్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ (ఉన్నట్లైతే), 2014 సెప్టెంబర్ 30కి ముందు జారీ చేసిన డ్రైవింగ్ లెసైన్స్, విద్యార్హత పత్రాలు, ఆధార్ ప్రతు ల్ని జత చేయాలి.
  • అభ్యర్థుల ఫిట్‌నెస్, పూర్వాపరాల పరిశీలన తర్వాత ఎంపిక జరుగుతుంది.
  • ఎంపికైన వారికి రోజుకు రూ.400 చొప్పున వేతనం చెల్లిస్తారు.

No comments:

Post a Comment