Saturday, 25 January 2020

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు (చివరితేది: 28.01.2020)

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ఖాళీ సీట్లకు అలుగునూరు, కరీంనగర్, గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.వివరాలు.....1) 6 నుంచి 9 తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీలు2) సెంటర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ అలుగునూరు, కరీంనగర్, గౌలిదొడ్డిలో 8వ తరగతి ప్రవేశాలు, సైనిక స్కూల్ రుక్మాపూర్‌, కరీంనగర్‌లో 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు.అర్హత: 2019-20 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8వ తరగతులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.పరీక్ష తేది: 23.02.2020.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌రఖాస్తుకు చివరితేది: 28.01.2020.
 
 

తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు (చివరితేది: 03.02.2020)

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న గిరిజన గురుకుల పాఠశాలల్లో 2020-21 సంవత్సరానికిగాను ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.వివరాలు......* అశోక్‌న‌గ‌ర్‌(వ‌రంగ‌ల్‌)లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్‌లో 6వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌(ఎంపీసీ) మొద‌టి సంవ‌త్స‌రం ప్ర‌వేశాలు.* ఇబ్ర‌హీంప‌ట్నం(రంగారెడ్డి)లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియ‌ర్ కాలేజ్ ఎన్‌డీఏ కోచింగ్ సెంట‌ర్‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌(ఎంపీసీ) మొద‌టి సంవ‌త్స‌రం ప్ర‌వేశాలు.అర్హత: సంబంధిత తరగతిలో ప్రవేశానికి కింది స్థాయి తరగతి అర్హత. గిరిజన విద్యార్థులు మాత్రమే అర్హులు.ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌ ద్వారా.రాతపరీక్ష తేది: 21.02.2020.ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేది: 11.03.2020.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 03.02.2020.
 
 

Wednesday, 8 January 2020

టీఎస్‌పీఎస్సీ- 36 ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్లు (చివ‌రితేది: 25.01.2020)

తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌(ఐపీఎం), గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ)లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం ఖాళీలు: 361) ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌(ఐపీఎం)-102) ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌(జీహెచ్ఎంసీ)-26అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల‌తో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు
: 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఆన్‌లైన్‌/ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.01.2020.
 
 

Friday, 3 January 2020

ఎస్‌బీఐలో 8000 జూనియ‌ర్ అసోసియేట్ ఖాళీలు (చివ‌రితేది: 26.01.2020)

ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..జూనియ‌ర్ అసోసియేట్‌(క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్‌)మొత్తం ఖాళీలు: 8000అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 01.01.2020 నాటికి 20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌(ప్రిలిమిన‌రీ & మెయిన్స్‌), లాంగ్వేజ్ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌ ఆధారంగా.ప్రిలిమ్స్ ప‌రీక్ష‌: ఫిబ్ర‌వ‌రి/ మార్చి 2020.మెయిన్స్ ప‌రీక్ష‌తేది: ఏప్రిల్ 19, 2020.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్/ ఓబీసీ/ ఈడ‌బ్ల్యూఎస్‌ అభ్య‌ర్థుల‌కు-రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ/ ఎక్స్ఎస్ అభ్య‌ర్థుల‌కు ఫీజు మిన‌హాయింపు.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జ‌న‌వ‌రి 03, 2020.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: జ‌న‌వ‌రి 26, 2020.

Thursday, 2 January 2020

సీసీఐలో 75 పోస్టులు (చివ‌రితేది: 27.01.2020)

భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ది కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(సీసీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం ఖాళీలు: 75పోస్టులు: అసిస్టెంట్ కంపెనీ సెక్ర‌ట‌రీ, అసిస్టెంట్ మేనేజ‌ర్‌, మేనేజ్‌మెంట్ ట్రెయినీ, జూనియ‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఎగ్జిక్యూటివ్‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌, హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌.అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, బీటెక్‌, పీజీ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 02.01.2020.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 27.01.2020.
 

Sunday, 29 December 2019

ఇండియా పోస్ట్‌లో స్టాఫ్ కార్ డ్రైవ‌ర్లు(చివ‌రితేది: 15.01.2020)

నాగ్‌పూర్‌లోని ఇండియా పోస్ట్ కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* స్టాఫ్ కార్ డ్రైవ‌ర్లుమొత్తం ఖాళీలు: 03.అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్, లైట్ అండ్ హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు క‌లిగి ఉండాలి.ఎంపిక విధానం: డ‌్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజంలో ప‌రిజ్ఞానం ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చిరునామా: మేనేజ‌ర్‌(గ్రూప్‌-ఏ), మెయిల్ మోటార్ స‌ర్వీస్‌, జీపీఓ కాంపౌండ్‌, సివిల్ లైన్స్‌, నాగ్‌పూర్‌-440001.
 
 

సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌, హైద‌రాబాద్ (చివ‌రితేది: 08.02.19)

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌పీఎంసీఎల్‌)కి చెందిన హైద‌రాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* మొత్తం ఖాళీలు: 29పోస్టులు-ఖాళీలు: జూనియ‌ర్ టెక్నీషియ‌న్‌(ప్రింటింగ్‌)-26, ఫైర్‌మెన్‌(రిసోర్స్ మేనేజ్‌మెంట్‌)-03.అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌, నిర్ధేశించిన శారీర‌క ప్ర‌మాణాలు.వ‌య‌సు: 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.01.2020.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 08.02.2020.
 
 

Wednesday, 25 December 2019

మే 5,6,7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, అగ్రికల్చర్ ఎంసెట్ 9, 11 తేదీల్లో

రాష్ట్రంలోని వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరంలో (2020-21) ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను డిసెంబర్ 24న తెలంగాణ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అనంతరం ఆ వివరాలను మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణతో కలసి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీలాసెట్, పీజీఈసెట్ నిర్వహణ తేదీలను కూడా ప్రకటించారు. మే 2వ తేదీన ఈసెట్‌తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతాయని, అదే నెలలో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు. జూలై నెలాఖరులోగా అన్ని కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలను పూర్తి చేస్తామని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని వివరించారు. ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ ఫలితాలు సకాలంలోనే వస్తుండగా, డిగ్రీ కోర్సుల పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించి, ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తామని వివరించారు. గతంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు (లాసెట్ ద్వారా) ఆలస్యం కాగా, న్యాయ విద్య కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్లకు అనుబంధ గుర్తింపు నేపథ్యంలో ఈసారి వాటిని కూడా సకాలంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అభ్యర్థులను బట్టి సెషన్స్ :ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్యను బట్టి సెషన్ల సంఖ్య ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను 5 సెషన్లలో నిర్వహిస్తామని, ఒక్కో సెషన్‌లో 50 వేల మందికి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గతేడాది ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,42,210 మంది దరఖాస్తు చేసుకున్నారని, దాన్ని బట్టి ఈసారి 1.5 లక్షల్లోపు దరఖాస్తులు వస్తే 6 సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను అభ్యర్థుల సంఖ్యను బట్టి 3 లేదా 4 సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు 50 వేలు దాటితే 23తోపాటు 24న కూడా నిర్వహిస్తామని చెప్పారు. గతేడాది ఈ సెట్స్ నిర్వహించిన యూనివర్సిటీలకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెట్స్ కన్వీనర్లను త్వరలోనే నియమిస్తామన్నారు.

నిమిషం నిబంధన యథాతథం..ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణలో నిమిషం నిబంధన యథావిధిగా ఉంటుందని పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వికలాంగులకు పరీక్ష ఫీజు తగ్గింపు అంశాన్ని ఆయా సెట్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చిలో సెట్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని తెలిపారు.

ఈసారి నేషనల్ పూల్ లేదు..ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలన్న నిబంధన ఈసారి లేదన్నారు. రాష్ట్ర సెట్స్ ద్వారానే ప్రవేశాలు చేపడతామన్నారు. ఒకవేళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాలు చేపట్టాలని తప్పనిసరి చేస్తే దాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఏడాది ముందుగానే ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

2020 మే నెలలో నిర్వహించే సెట్స్ తేదీలు :
తేదీ
సెట్
నిర్వహణ యూనివర్సిటీ
2
ఈసెట్
జేఎన్టీయూ(హెచ్)
5 ,6, 7
ఎంసెట్
జేఎన్టీయూ(హెచ్) (ఇంజనీరింగ్)
9, 11
ఎంసెట్
జేఎన్టీయూ(హెచ్) (అగ్రికల్చర్)
13 నుంచి
పీఈసెట్
మహత్మాగాంధీ యూనివర్సిటీ
20, 21
ఐసెట్
కాకతీయ యూనివర్సిటీ
23
ఎడ్‌సెట్
ఉస్మానియా యూనివర్సిటీ
25
లాసెట్
ఉస్మానియా యూనివర్సిటీ
25
పీజీ లాసెట్
ఉస్మానియా యూనివర్సిటీ
27 నుంచి 30 వరకు
పీజీఈసెట్
ఉస్మానియా యూనివర్సిటీ

దిల్లీ పోలీస్‌లో 649 హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు (చివ‌రితేది: 27.01.2020)

దిల్లీ పోలీస్ విభాగం దేశ‌వ్యాప్తంగా అర్హులైన స్త్రీ, పురుష‌ అభ్య‌ర్థుల నుంచి కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* హెడ్ కానిస్టేబుల్‌* మొత్తం ఖాళీలు: 585(డిపార్ట్‌మెంట‌ల్ మిన‌హాయించి)అర్హ‌త‌: సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌/ స‌ంబంధిత స‌బ్జెక్టులో నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్‌(ఎన్‌టీసీ), టైపింగ్‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌.వ‌య‌సు: 01.07.2019 నాటికి 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: డిసెంబ‌రు 28.ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: జ‌న‌వ‌రి 27, 2020.