Monday 24 September 2018

VRO Answer Keys: వీఆర్వో పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల.. 30 వరకు అభ్యంతరాల స్వీకరణ..

తెలంగాణలో వీఆర్వో పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 16న నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక (ప్రిలిమినరీ) 'కీ' ని టీఎస్‌పీఎస్సీ అధికారులు విడుదల చేశారు. శనివారమే కీ విడుదల చేసినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆదివారం (సెప్టెంబరు 23) అందుబాటులో పెట్టారు. ప్రాథమిక 'కీ' విడుదల చేసిన అనంతరం.. 'కీ'పై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే సెప్టెంబరు 24 నుంచి 30 వరకు స్వీకరించనున్నట్లు వారు తెలిపారు. 30 తర్వాత తెలిపే అభ్యంతాలను పరిగణించరు. అనంతరం తుది 'కీ' విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను విడుదల చేస్తారు.


ప్రాథమిక 'కీ' కోసం క్లిక్ చేయండి..

వీఆర్వో రాతపరీక్ష జవాబు పత్రాలు..

700 వీఆర్వో పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 10.58 లక్షల మంది దరఖాస్తుచేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో 10 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 7,87,049 మంది (78.46%) హాజరయ్యారు. ఈ పరీక్ష నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 2,945 పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాల కోెసం వెబ్‌సైట్ చూడవచ్చు.
వెబ్‌సైట్

No comments:

Post a Comment