ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) క్లర్కు పోస్టుల భర్తీకి
కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) ఎగ్జామినేషన్-VIII ద్వారా
దరఖాస్తులు కోరుతోంది. వివరాలు...* ఐబీపీఎస్ సీఆర్‌పీ క్లర్క్స్ VIIIమొత్తం పోస్టుల సంఖ్య: 72751) తెలంగాణలో 162 ఖాళీలుబ్యాంకుల వారీగా ఖాళీలు:
అలహాబాద్ బ్యాంకు-20, బ్యాంక్ ఆఫ్ బరోడా-13, బ్యాంక్ ఆఫ్ ఇండియా-06,
కెనరా బ్యాంక్-60, కార్పొరేషన్ బ్యాంక్-07, ఇండియన్ బ్యాంక్-15,
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-05, యూకో బ్యాంక్-08, యూనియన్ బ్యాంక్
ఆఫ్ ఇండియా-20, విజయా బ్యాంక్-08.2) ఏపీలో 167 ఖాళీలుబ్యాంకుల వారీగా ఖాళీలు:
అలహాబాద్ బ్యాంకు-15, బ్యాంక్ ఆఫ్ బరోడా-16, బ్యాంక్ ఆఫ్ ఇండియా-09,
కార్పొరేషన్ బ్యాంక్-10, ఇండియన్ బ్యాంక్-52, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్
కామర్స్-10, యూకో బ్యాంక్-08, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-39, విజయా
బ్యాంక్-08.అర్హత: ఏదైనా
డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్ధి దరఖాస్తు చేసుకునే
రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం
వచ్చి ఉండాలి.వయసు: 01.09.2018 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా.పరీక్ష విధానం: *
ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి.
ఇంగ్లిష్-30, న్యూమరికల్ ఎబిలిటీ-35, రీజనింగ్ ఎబిలిటీ-35 మార్కులకు
పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 1 గంట.*
మెయిన్ పరీక్షలో మొత్తం 190 ప్రశ్నలకు గాను 200 మార్కులు ఉంటాయి.
ఇందులో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలకు 50 మార్కులు,
జనరల్ ఇంగ్లిష్- 40 ప్రశ్నలకు 40 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ &
కంప్యూటర్ అప్టిట్యూడ్- 50 ప్రశ్నలకు 60 మార్కులు, క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్- 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 160
నిమిషాలు. తెలుగు
రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు,
కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం,
తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్,
కరీంనగర్, ఖమ్మం, వరంగల్.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100, ఇతరులకు రూ.600.ముఖ్యమైన తేదీలు...* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 18.09.2018.* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: 10.10.2018.* ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్: నవంబరు, 2018. * ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ పరీక్ష తేది: 26.11.2018 - 01.12.2018.* ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెటర్ డౌన్‌లోడ్: నవంబరు, 2018. * ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్) తేదీ: 2018 డిసెంబరు 8, 9, 15, 16 తేదీల్లో. * ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్) ఫలితాలు: డిసెంబరు 2018/ జనవరి 2019.* మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్) కాల్‌లెటర్ డౌన్‌లోడ్: జనవరి, 2019. * మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్) తేది: 20.01.2019.* ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్ 2019.
|
No comments:
Post a Comment