తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) పోలీసు శాఖలోని పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు అగ్నిమాపక విపత్తు నివారణ, జైళ్లశాఖ, ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్‌మెన్, డిప్యూటీ జైలర్, వార్డర్, అసిస్టెంట్ మ్యాట్రన్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో 17,156 ఉద్యోగాలు కానిస్టేబుళ్లు కాగా.. 1272 ఎస్సై పోస్టులు ఉన్నాయి.వివరాలు.....మొత్తం పోస్టుల సంఖ్య: 18,4281) కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య: 17,156విభాగాలవారీ ఖాళీలు: సివిల్-5909, ఏఆర్-5273, ఎస్ఏఆర్ సీపీఎల్-53, టీఎస్ ఎస్‌పీ-4816, ఎస్‌పీఎఫ్-485, ఫైర్ సర్వీస్-168, వార్డర్స్ (మేల్)-186, వార్డర్స్ (ఫిమేల్)-35, ఐటీ అండ్ కమ్యూనికేషన్-142, మెకానిక్స్ (ట్రాన్స్‌పోర్ట్)-19, డ్రైవర్స్-70. అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత. ఐటీ అండ్ కమ్యూనికేషన్, డ్రైవర్ పోస్టులకు నిబంధల మేరకు అర్హతలు అవసరం. ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్ రెండేళ్ల పరీక్షలకు హాజరైతే సరిపోతుంది. వయసు: జులై 1, 2018 నాటికి 18-22 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1996 కంటే ముందు జులై 1, 2000 తర్వాత జన్మించినవారు
అనర్హులు. డ్రైవర్ పోస్టులకు 21-25 ఏళ్లలోపు వారు అర్హులు.
2) ఎస్సై పోస్టుల సంఖ్య: 1272విభాగాలవారీ ఖాళీల వివరాలు: సివిల్-710, ఏఆర్-275, ఎస్ఏఆర్ సీపీఎల్-05, రిజర్వ్-175, రిజర్వ్ (15వ బెటాలియన్)-16, ఫైర్ సర్వీస్ 19, డిప్యూటీ జైలర్-15, అసిస్టెంట్ మ్యాట్రన్-02, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్-29, ఫింగర్ ప్రింట్ బ్యూరో-26.అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు కనీసం మూడేళ్ల డిగ్రీ కోర్సు చదివితే సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ పోస్టులకు ఈసీఈ/ ఈఈఈ/ సీఎస్/ ఐటీ వీటిలో ఎందులోనైనా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. ఫింగర్ ప్రింట్ బ్యూరో పోస్టులకు కంప్యూటర్ సైన్స్ / ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ వీటిలో ఎందులోనైనా డిగ్రీ ఉండాలి.వయసు: జులై 1, 2018 నాటికి 21 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఫైర్ సర్వీస్, డిప్యూటీ జైలర్ పోస్టులకు 30 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: ప్రాథమిక రాతపరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తుది రాతపరీక్ష ద్వారా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు: కానిస్టేబుల్ పోస్టులకు రూ.800, ఎస్సై పోస్టులకు రూ.1000.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 09.06.2018ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.06.2018
|
Thursday, 31 May 2018
తెలంగాణలో 18,428 పోలీసు ఉద్యోగాలు (చివరి తేది: 30.06.18)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment