Friday 23 December 2016

నేవీలో ఉద్యోగాలు

నేవీలో ఉద్యోగాలు

స్టివార్డ్, చెఫ్, హైజీనిస్ట్ కొలువుల నియామకానికి భారతనావికాదళం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు తొలుత 2017 అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఎంఆర్/ఎన్‌ఎంఆర్ ఎంట్రీ కోర్సులో శిక్షణ పొందాల్సి ఉంటుంది.
Jobsవేతనం: ట్రైనింగ్‌లో నెలకు రూ.5,700 స్టైపెండ్ ఇస్తారు. తర్వాత రూ.5,200-20,200 పేబ్యాండ్ అమలుచేస్తారు. దీంతోపాటు గ్రేడ్‌పే రూ.2000, ఎంఎస్‌పీ రూ.2000, డీఏ తదితర అలవెన్సులు ఉంటాయి.
విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత (ఎంఆర్ ఎంట్రీకి), 6వ తరగతి ఉత్తీర్ణత (ఎన్‌ఎంఆర్ ఎంట్రీకి).
వయసు: కనీసం 17 ఏళ్లు, గరిష్టం 21 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, శారీరక దృఢత్వ పరీక్ష (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్-పీఎఫ్‌టీ), వైద్య పరీక్ష (మెడికల్ ఎగ్జామినేషన్) ఆధారంగా ఎంపికచేస్తారు.
ఎ. రాత పరీక్ష: స్టివార్డ్, చెఫ్ పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో నాలుగు సెక్షన్లు (ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్) ఉంటాయి. గంట వ్యవధిలో జరిగే ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. హైజీనిస్ట్ పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో రెండు సెక్షన్లు (జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్) ఉంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌తోపాటు మొత్తంమీద కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
బి. పీఎఫ్‌టీ: ఇందులో మూడు ఈవెంట్లు ఉంటాయి. 1. ఏడు నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి. 2. 20 స్క్వాటప్‌లు తీయాలి. 3. 10 పుషప్‌లు చేయాలి.
సూచన: స్పోర్ట్స్, స్విమ్మింగ్, ఎక్‌స్ట్రా కరికులర్ యాక్టివిటీస్‌లో ప్రావీణ్యం అవసరం.
శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు, ఎత్తుకు తగ్గ ఛాతీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతీ కనీసం 5 సెం.మీ. విస్తరించాలి. అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులై ఉండాలి. శరరీంపై పచ్చబొట్టు ఉండకూడదు. కంటి చూపు.. ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎత్తు విషయంలో ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఇస్తారు.
ట్రైనింగ్ : తొలుత 15 వారాల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. తర్వాత సంబంధిత ట్రేడ్‌లలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తారు.
సర్వీసు: విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను తొలుత 15 ఏళ్ల కాలానికి నియమిస్తారు.

ముఖ్య తేదీలు:
1. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2017, జనవరి 2
2. హార్‌‌డ కాపీ పంపేందుకు చివరి తేదీ: 2017, జనవరి 9
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

No comments:

Post a Comment