ఖాళీల వివరాలు: ఓసీ-202, ఓబీసీ-108, ఎస్సీ-60, ఎస్టీ-30. ఇందులో 3 శాతం సీట్లను దివ్యాంగులకు రిజర్వ్ చేశారు.
కోర్సు ఫీజు: రూ.
3.5 లక్షలు. ఈ రుసుం చెల్లించేందుకు బ్యాంక్ నుంచి రుణం పొందొచ్చు. ఈ
మొత్తాన్ని శిక్షణ అనంతరం పీవోగా చేరిన తర్వాత ఏడేళ్లలో నెలవారీ వాయిదాల్లో
చెల్లించాల్సి ఉంటుంది.
స్టైపెండ్: 9 నెలల తరగతి గది బోధన సమయంలో నెలకు రూ.2500 స్టైపెండ్; 3 నెలల ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.10,000 ఇస్తారు.
లాయల్టీ బోనస్: ఐదేళ్ల
సర్వీసును విజయవంతంగా పూర్తిచేసిన ఆఫీసర్లకు ఏడాదికి రూ. లక్ష చొప్పున
రూ.5 లక్షలు లాయల్టీ బోనస్ ఇస్తారు. తర్వాత 6 నుంచి 10వ సంవత్సరం వరకు కూడా
ఇలాగే ఏడాదికి రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు.
విద్యార్హత (2016 అక్టోబర్ 1 నాటికి): కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది.
వయసు(2016 అక్టోబర్ 1 నాటికి): కనీసం 20 ఏళ్లు, గరిష్టం 28 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: రెండు
గంటల (120 నిమిషాల) వ్యవధి ఉండే ఈ పరీక్షలో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు (200
మార్కులు) జవాబులు గుర్తించాలి. ఇందులో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నల
చొప్పున మొత్తం నాలుగు సబ్జెక్టుల(రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,
ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్) నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి
సబ్జెక్టులోనూ, మొత్తం మీద కనీస మార్కులు సాధించాలి. నెగెటివ్ మార్కింగ్
విధానం ఉంటుంది.
పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్: రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ‘ఒక పోస్టుకు నలుగురు చొప్పున’ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100; ఇతరులు రూ.600 చెల్లించాలి.
ముఖ్య తేదీలు:
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 28
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 2017 ఫిబ్రవరి 14 తర్వాత
- ఆన్‌లైన్ పరీక్ష తేది: 2017 ఫిబ్రవరి 26
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.syndicatebank.in
No comments:
Post a Comment