Thursday, 29 December 2016

నేవీలో 121 చార్జ్‌మ్యాన్ పోస్టులు

ముంబై నావల్ డాక్‌యార్డ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న చార్జ్‌మ్యాన్ పోస్టులను భర్తీచేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు దేశంలోని ఏ నావల్ యూనిట్‌లోనైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
Jobsవిభాగాలు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు:
  1. ఇంజనీరింగ్-33 (ఎస్సీ-4, ఎస్టీ-3, ఓబీసీ-7, ఓసీ-19)
  2. ఎలక్ట్రికల్-14 (ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-3, ఓసీ-8)
  3. వెపన్-8 (ఓబీసీ-2, ఓసీ-6)
  4. కన్‌స్ట్రక్షన్-24 (ఎస్సీ-2, ఓబీసీ-10, ఓసీ-12)
  5. మెయింటనెన్స్-10 (ఓబీసీ-4, ఓసీ-6)
  6. ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్-32 (ఎస్సీ-6, ఎస్టీ-2, ఓబీసీ-9, ఓసీ-15)
విద్యార్హత: డిగ్రీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్)/సంబంధిత ఇంజనీరింగ్ ట్రేడ్‌లో డిప్లొమా.

విభాగాలు : వాటి కింద పరిగణనలోకి తీసుకునే ట్రేడ్‌లు
  1. ఇంజనీరింగ్: ఫౌండ్రీ, ఇంజిన్ ఫిట్టర్, రిఫ్రిజిరేషన్, ఏసీ ఫిట్టర్, ఐసీఈ ఫిట్టర్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్.
  2. ఎలక్ట్రికల్: ఎలక్ట్రికల్/పవర్.
  3. వెపన్: ఎలక్ట్రానిక్ ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ ఫిట్టర్, రేడియో ఫిట్టర్, వెపన్ ఫిట్టర్.
  4. కన్‌స్ట్రక్షన్: పెయింటర్, ప్లాటర్, రిగ్గర్, షిప్ ఫిట్టర్, షిప్‌రైట్, ల్యాగర్, వెల్డర్.
  5. మెయింటనెన్స్: సివిల్ వర్క్, ఐసీఈ ఫిట్టర్ (క్రేన్), మిల్ రైట్ ఫిట్టర్.
  6. ప్రొడక్షన్, ప్లానింగ్, కంట్రోల్: ఏ ట్రేడ్ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం: రూ.35,400-81,200 పే బ్యాండ్ ఉంటుంది.
వయసు: కనీసం 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
గమనిక: విద్యార్హత, వయసు తదితరాలకు కటాఫ్ డేట్‌గా 2017, జనవరి 13ను పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక విధానం : రాత పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. వీటిని డిగ్రీ స్థాయి ఫిజిక్స్/ కెమిస్ట్రీ/మ్యాథ్స్ నుంచి లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/మేనేజ్‌మెంట్/సూపర్ న్యూమరరీ స్కిల్స్/జనరల్ నాలెడ్జ్/జనరల్ ఇంగ్లిష్ (మెట్రిక్ లెవల్) నుంచి రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఒక అభ్యర్థి ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 13
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.jobsuchi.com

No comments:

Post a Comment