Thursday 29 December 2016

రక్షణ శాఖలో 115 ఉద్యోగాలు

రక్షణశాఖ పరిధిలోని ‘17 ఫీల్డ్ అమ్యునిషన్ డిపో’ వివిధ ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఈ ఆయుధాగారం పంజాబ్‌లోని లూథియానాలో ఉంది.
Jobsఖాళీలు:
  1. ట్రేడ్స్‌మ్యాన్‌మేట్-97 (ఓసీ-57, ఎస్సీ-10, ఓబీసీ-30)
  2. ఫైర్‌మ్యాన్-1 (ఓసీ)
  3. మెటీరియల్ అసిస్టెంట్-7 (ఓసీ-4, ఎస్సీ-2, ఓబీసీ-1)
  4. లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)-10 (ఓసీ-5, ఎస్సీ-2, ఓబీసీ-3)
వేతనం: ఈ నాలుగు రకాల ఉద్యోగాలకూ సమానంగా (నెలకు రూ.5,200-20,200) చెల్లిస్తారు. కానీ గ్రేడ్‌పేల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ట్రేడ్స్‌మ్యాన్‌మేట్‌కు గ్రేడ్‌పే రూ.1800, ఫైర్‌మ్యాన్‌కు రూ.1900, మెటీరియల్ అసిస్టెంట్‌కు రూ.2,800, ఎల్‌డీసీకి రూ.1900.

విద్యార్హత:
  1. ట్రేడ్స్‌మ్యాన్‌మేట్: పదో తరగతి/తత్సమానం, హిందీ భాషా పరిజ్ఞానం ఉండాలి.
  2. ఫైర్‌మ్యాన్: పదో తరగతి/తత్సమానం.
  3. మెటీరియల్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ లేదా మెటీరియల్ మేనేజ్‌మెంట్/ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో డిప్లొమా.
  4. ఎల్‌డీసీ: 12వ తరగతి/తత్సమానం, నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలను/30 హిందీ పదాలను కంప్యూటర్‌లో టైపింగ్ చేయగలగాలి.
శారీరక సామర్థ్యం/ప్రమాణాలు :
  1. ట్రేడ్స్‌మ్యాన్‌మేట్: 5.5 నిమిషాల్లో 1.5 కిలోమీటర్ల దూరం పరుగెత్తాలి. 30 కిలోల బరువును 30 సెకన్లలో 100 మీటర్ల దూరం మోయాలి. 20 కిలోల ఆయుధాల పెట్టెను మూడు సార్లు నెత్తి మీదకు ఎత్తుకొని దించాలి.
  2. ఫైర్‌మ్యాన్: 165 సెం.మీ; ఎత్తు, 81.5 సెం.మీ. ఛాతీ (గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ.కు విస్తరించాలి); 50 కిలోల బరువు ఉండాలి.
వయసు: కనీసం 18 ఏళ్లు. పోస్టును, కేటగిరీని బట్టి గరిష్ట వయసు మారుతుంది.

ఎంపిక విధానం :
  1. ట్రేడ్స్‌మ్యాన్‌మేట్: రాత పరీక్ష
    సబ్జెక్టు
    ప్రశ్నల సంఖ్య
    మార్కులు
    జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్
    25
    25
    న్యూమరికల్ ఆప్టిట్యూడ్
    25
    25
    జనరల్ ఇంగ్లిష్
    50
    50
    జనరల్ అవేర్‌నెస్
    50
    50
    మొత్తం
    150
    150
  2. ఫైర్‌మ్యాన్: శారీరక సామర్థ్య పరీక్ష, రాత పరీక్ష
  3. మెటీరియల్ అసిస్టెంట్: రాత పరీక్ష
  4. ఎల్‌డీసీ: టైపింగ్ టెస్ట్, రాత పరీక్ష
రాత పరీక్ష: 120 నిమిషాల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ప్రశ్నలు పదో తరగతి/ఇంటర్ స్థాయిలో ఉంటాయి.
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి, ఆర్డినరీ/రిజిస్టర్డ్/స్పీడ్ పోస్టులో పంపాలి.
చిరునామా: 17, ఫీల్డ్ అమ్యునిషన్ డిపో, సీ/ఓ-56, ఏపీఓ, లూథియానా, పంజాబ్, పిన్-909717.
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 20

No comments:

Post a Comment