Saturday, 15 April 2017

తెలంగాణ గురుకులాల్లో 4362 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో వివిధ స‌బ్జెక్టుల‌ల్లో ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీ)ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివ‌రాలు
:1. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ: 74 పోస్టులు2. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 1281 పోస్టులు3. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 621 పోస్టులు4. మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ‌ బ్యాక్‌వ‌ర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 1170 పోస్టులు5. తెలంగాణ‌ మైనారిటీస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 1216 పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 4362
వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
అర్హతలు: క‌నీసం 50% మార్కుల‌తో బీఏ/ బీఎస్సీ/ బీకాం. సంబంధిత మెథ‌డాల‌జీలో బీఈడీ. లేదా 50% మార్కుల‌తో నాలుగేళ్ల బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ(సంబంధిత మెథ‌డాల‌జీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఆప్షన‌ల్ స‌బ్జెక్టుగా సంబంధిత భాష‌లో డిగ్రీ లేదా డిగ్రీ (ఓరియంట‌ల్ లాంగ్వేజ్‌). లేదా లిట‌రేచ‌ర్ డిగ్రీ లేదా సంబంధిత భాష‌లో పీజీతో పాటు 50% మార్కుల‌తో లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ స‌ర్టిఫికెట్‌/ బీఈడీ (సంబంధిత మెథ‌డాల‌జీ). టీఎస్ టెట్‌/ ఏపీటెట్‌/ సీటెట్ (పేప‌ర్‌-II)లో ఉత్తీర్ణులై ఉండాలి.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 18.04.2017.
చివరి తేది: 04.05.2017.
ప్రాథ‌మిక‌ (స్క్రీనింగ్) ప‌రీక్ష తేది: 28.05.2017.

 
 

No comments:

Post a Comment