ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ఎస్, సీఐఎస్‌ఎఫ్లో 2221 పోస్టులు
ఢిల్లీ
పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌ఎస్)లో సబ్
ఇన్‌స్పెక్టర్లు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి ‘రిక్రూట్‌మెంట్ ఆఫ్ సబ్
ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ఎస్ అండ్ అసిస్టెంట్ సబ్
ఇన్‌స్పెక్టర్స్ ఇన్ సీఐఎస్‌ఎఫ్ ఎగ్జామినేషన్-2017’ నోటిఫికేషన్‌ను స్టాఫ్
సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది.
|
పోస్టులు-ఖాళీలు: సబ్ ఇన్‌స్పెక్టర్ (ఢిల్లీ పోలీస్/సీఏపీఎఫ్‌ఎస్)-1658, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (సీఐఎస్‌ఎఫ్)-563.
విభాగాల వారీగా పోస్టులు... ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు : 872. వీటిలో పురుషులకు 616, మహిళలకు 256 కేటాయించారు. పురుషుల పోస్టుల్లో జనరల్-274, ఓబీసీ-158, ఎస్సీ-79, ఎస్టీ-37, ఎక్స్-సర్వీస్‌మెన్-68 (జనరల్ 35+ఓబీసీ 18 + ఎస్సీ 10 + ఎస్టీ 5) పోస్టులు ఉన్నాయి. మహిళల పోస్టుల్లో జనరల్‌కు 129, ఓబీసీ-68, ఎస్సీ-40, ఎస్టీ-19 కేటాయించారు.
వయోపరిమితి: 2017, జనవరి 1 నాటికి 20-25 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ. దీంతోపాటు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఢిల్లీ పోలీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డ్రైవింగ్ లెసైన్స్ -ఎల్‌ఎమ్‌వీ (మోటార్ సైకిల్, కార్) కచ్చితంగా ఉండాలి. శారీరక ప్రమాణాలు (ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్-పీఎస్‌టీ): పురుషులకు.. ఎత్తు 170 సెం.మీ, ఛాతీ 80 (సాధారణం)-85 (వ్యాకోచించినప్పుడు). ఎస్టీ అభ్యర్థులకు ఎత్తు 162.5 సెం.మీ., ఛాతీ 77 (సాధారణం)-82 (వ్యాకోచించినప్పుడు). మహిళలకు.. ఎత్తు 157 సెం.మీ. ఎస్టీ అభ్యర్థులకు 154 సెం.మీ. అభ్యర్థులందరూ ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ): పురుషులు.. పరుగుపందెంలో 100 మీటర్ల దూరాన్ని 16 సెకన్లలో, 1.6 కి.మీ దూరాన్ని 6.5 నిమిషాల్లో పూర్తిచేయాలి. లాంగ్‌జంప్‌లో 3.65 మీటర్ల దూరాన్ని మూడు అవకాశాల్లో అధిగమించాలి. హైజంప్‌లో 1.2 మీటర్ల ఎత్తును మూడు అవకాశాల్లో అధిగమించాలి. షాట్‌పుట్ (16 ఎల్‌బీఎస్)లో 4.5 మీటర్ల దూరాన్ని చేరేలా మూడు అవకాశాల్లో విసరగలగాలి. మహిళలు.. పరుగుపందెంలో 100 మీటర్ల దూరాన్ని 18 సెకన్లలో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో చేరుకోవాలి. లాంగ్ జంప్‌లో 2.7 మీటర్ల దూరాన్ని మూడు అవకాశాల్లో అధిగమించాలి. హైజంప్‌లో 0.9 మీటర్ల ఎత్తును మూడు అవకాశాల్లో అధిగమించాలి. మెడికల్ స్టాండర్డ్స్: పీఈటీ టెస్టులో ఉత్తీర్ణులైన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నిబంధనల మేరకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. దీంతోపాటు తగిన దృష్టి సామర్థ్యం తప్పనిసరి. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష, పీఈటీ, పీఎస్‌టీ, మెడికల్ స్టాండర్డ్స్ టెస్టులు. రాతపరీక్షను పేపర్-1, పేపర్-2గా నిర్వహిస్తారు. పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ ఉంటాయి. ఒక్కో దాంట్లో 50 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పేపర్ -1 ఉంటుంది. పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ 200 మార్కులకు ఉంటుంది. పీఈటీ, పీఎస్‌టీ, మెడికల్ స్టాండర్డ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే పేపర్-2 రాయడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు: రూ.100 (జనరల్/ఓబీసీ). ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు రుసుమును ఎస్‌బీఐ చలాన్/ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తు: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: మే 15, 2017. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.ssconline.nic.in లేదా www.ssc.nic.in |
No comments:
Post a Comment