Wednesday, 26 April 2017

ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ఎస్, సీఐఎస్‌ఎఫ్లో 2221 పోస్టులు

ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ఎస్, సీఐఎస్‌ఎఫ్లో 2221 పోస్టులు

ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌ఎస్)లో సబ్ ఇన్‌స్పెక్టర్లు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి ‘రిక్రూట్‌మెంట్ ఆఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌ఎస్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్స్ ఇన్ సీఐఎస్‌ఎఫ్ ఎగ్జామినేషన్-2017’ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది.
Jobsపోస్టులు-ఖాళీలు: సబ్ ఇన్‌స్పెక్టర్ (ఢిల్లీ పోలీస్/సీఏపీఎఫ్‌ఎస్)-1658, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (సీఐఎస్‌ఎఫ్)-563.
విభాగాల వారీగా పోస్టులు...
ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు :
872. వీటిలో పురుషులకు 616, మహిళలకు 256 కేటాయించారు. పురుషుల పోస్టుల్లో జనరల్-274, ఓబీసీ-158, ఎస్సీ-79, ఎస్టీ-37, ఎక్స్-సర్వీస్‌మెన్-68 (జనరల్ 35+ఓబీసీ 18 + ఎస్సీ 10 + ఎస్టీ 5) పోస్టులు ఉన్నాయి. మహిళల పోస్టుల్లో జనరల్‌కు 129, ఓబీసీ-68, ఎస్సీ-40, ఎస్టీ-19 కేటాయించారు.
  • సీఏపీఎఫ్‌ఎస్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు-786. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)లో పురుషులకు 298 (అన్ రిజర్వుడ్-150, ఓబీసీ-81, ఎస్సీ-45, ఎస్టీ-22), మహిళలకు 45 (అన్‌రిజర్వుడ్-23, ఓబీసీ-12, ఎస్సీ-7, ఎస్టీ-3) పోస్టులు కేటాయించారు.
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో పురుషులకు 79 (అన్‌రిజర్వుడ్-42, ఓబీసీ-21, ఎస్సీ-11, ఎస్టీ-5), మహిళలకు 9 (అన్‌రిజర్వుడ్-6, ఓబీసీ-2, ఎస్సీ-1) పోస్టులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)లో పురుషులకు 241(అన్‌రిజర్వుడ్ -122, ఓబీసీ-65, ఎస్సీ-36, ఎస్టీ-18) పోస్టులు, సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ)లో పురుషులకు 79 (అన్‌రిజర్వుడ్-40, ఓబీసీ-21, ఎస్సీ-12, ఎస్టీ-6) పోస్టులు, మహిళలకు 35 (అన్‌రిజర్వుడ్-20, ఓబీసీ-7, ఎస్సీ-7, ఎస్టీ-1) పోస్టులు కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా కింద పోస్టులున్నాయి. సీఆర్‌పీఎఫ్‌లో మహిళలకు పోస్టులు లేవు.
  • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో మొత్తం అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 563. వీటిలో పురుషులకు 507 (అన్‌రిజర్వుడ్-258, ఓబీసీ-136, ఎస్సీ-76, ఎస్టీ-37), మహిళలకు 56 (అన్‌రిజర్వుడ్-29, ఓబీసీ-15, ఎస్సీ-8, ఎస్టీ-4) కేటాయించారు. అలాగే పురుషుల పోస్టుల్లోని అన్ని రిజర్వేషన్ కేటగిరీల్లోనూ ఎక్స్-సర్వీస్‌మెన్ కోటాకు పోస్టులు ఉన్నాయి.
వేతనం: సబ్ ఇన్‌స్పెక్టర్ (ఢిల్లీ పోలీస్/సీఏపీఎఫ్‌ఎస్) పోస్టులకు రూ.35,400-1,12,400; అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (సీఐఎస్‌ఎఫ్) పోస్టులకు రూ.29,200-92,900.
వయోపరిమితి: 2017, జనవరి 1 నాటికి 20-25 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ. దీంతోపాటు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఢిల్లీ పోలీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డ్రైవింగ్ లెసైన్స్ -ఎల్‌ఎమ్‌వీ (మోటార్ సైకిల్, కార్) కచ్చితంగా ఉండాలి.
శారీరక ప్రమాణాలు (ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్-పీఎస్‌టీ): పురుషులకు.. ఎత్తు 170 సెం.మీ, ఛాతీ 80 (సాధారణం)-85 (వ్యాకోచించినప్పుడు). ఎస్టీ అభ్యర్థులకు ఎత్తు 162.5 సెం.మీ., ఛాతీ 77 (సాధారణం)-82 (వ్యాకోచించినప్పుడు). మహిళలకు.. ఎత్తు 157 సెం.మీ. ఎస్టీ అభ్యర్థులకు 154 సెం.మీ. అభ్యర్థులందరూ ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండాలి.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ): పురుషులు.. పరుగుపందెంలో 100 మీటర్ల దూరాన్ని 16 సెకన్లలో, 1.6 కి.మీ దూరాన్ని 6.5 నిమిషాల్లో పూర్తిచేయాలి. లాంగ్‌జంప్‌లో 3.65 మీటర్ల దూరాన్ని మూడు అవకాశాల్లో అధిగమించాలి. హైజంప్‌లో 1.2 మీటర్ల ఎత్తును మూడు అవకాశాల్లో అధిగమించాలి. షాట్‌పుట్ (16 ఎల్‌బీఎస్)లో 4.5 మీటర్ల దూరాన్ని చేరేలా మూడు అవకాశాల్లో విసరగలగాలి. మహిళలు.. పరుగుపందెంలో 100 మీటర్ల దూరాన్ని 18 సెకన్లలో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో చేరుకోవాలి. లాంగ్ జంప్‌లో 2.7 మీటర్ల దూరాన్ని మూడు అవకాశాల్లో అధిగమించాలి. హైజంప్‌లో 0.9 మీటర్ల ఎత్తును మూడు అవకాశాల్లో అధిగమించాలి.
మెడికల్ స్టాండర్డ్స్: పీఈటీ టెస్టులో ఉత్తీర్ణులైన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నిబంధనల మేరకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. దీంతోపాటు తగిన దృష్టి సామర్థ్యం తప్పనిసరి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష, పీఈటీ, పీఎస్‌టీ, మెడికల్ స్టాండర్డ్స్ టెస్టులు. రాతపరీక్షను పేపర్-1, పేపర్-2గా నిర్వహిస్తారు. పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ ఉంటాయి. ఒక్కో దాంట్లో 50 మార్కుల
చొప్పున మొత్తం 200 మార్కులకు పేపర్ -1 ఉంటుంది. పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ 200 మార్కులకు ఉంటుంది. పీఈటీ, పీఎస్‌టీ, మెడికల్ స్టాండర్డ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే పేపర్-2 రాయడానికి అర్హులు.
దరఖాస్తు ఫీజు: రూ.100 (జనరల్/ఓబీసీ). ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు రుసుమును ఎస్‌బీఐ చలాన్/ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 15, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.ssconline.nic.in లేదా www.ssc.nic.in

Saturday, 15 April 2017

గోవా షిప్‌యార్డులో 149 ఖాళీలు(చివ‌రితేది: 15.05.2017)

గోవా షిప్‌యార్డు వివిధ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* ఖాళీల సంఖ్య: 149 పోస్టులు1) అసిస్టెంట్ సూప‌రింటెండెంట్‌: 10
2)
టెక్నిక‌ల్ అసిస్టెంట్‌: 37
3)
ఈడీపీ/ఈఆర్‌పీ అసిస్టెంట్ (గ్రేడ్‌-2): 02
4)
సివిల్ అసిస్టెంట్ (గ్రేడ్‌-2): 01
5)
ఆఫీస్ అసిస్టెంట్‌: 10
6)
జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌: 01
7)
క‌మ‌ర్షియ‌ల్ అసిస్టెంట్‌: 09
8)
డిప్లొమా ట్రైనీ: 17
9)
ట్రైనీ షిప్‌రైట్ ఫిట్టర్‌: 04
10)
ట్రైనీ మెషినిస్ట్‌: 02
11)
టెలిఫోన్ ఆప‌రేట‌ర్‌: 01
12)
స్టోర్ అసిస్టెంట్‌: 09
13)
యార్డ్ అసిస్టెంట్‌: 01
14)
ఖ‌లాసీ: 02
15)
ఆటో ఎల‌క్ట్రీషియ‌న్‌: 01
16)
రికార్డ్ కీప‌ర్‌: 01
17)
రిగ్గర్‌: 04
18)
వెహికిల్ డ్రైవ‌ర్‌: 06
19)
పెయింట‌ర్‌: 01
20)
మోబైల్ క్రేన్ ఆప‌రేట‌ర్: 02
21)
ఈఓటీ క్రేన్ ఆప‌రేట‌ర్‌: 03
22)
అన్‌స్కిల్డ్ గ్రేడ్‌: 25ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.04.2017.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 15.05.2017.ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్రింట్ (హార్డ్‌) కాపీల స‌మ‌ర్పణ‌కు చివ‌రితేది: 25.05.2017.

 
 
 

తెలంగాణ‌ గురుకులాల్లో 7,306 కొలువులు

గురుకులాల్లో భారీ స్థాయిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 7,306 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
పోస్టుల వివ‌రాలు
...1. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ): 4362 పోస్టులు2. పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ): 921 పోస్టులు3. ఫిజికల్‌ డైరెక్టర్‌ (పాఠశాలలు): 06 పోస్టులు4. ఫిజికల్‌ ఎడ్యుకేషన్ టీచ‌ర్‌: 616 పోస్టులు5. ఆర్ట్ టీచ‌ర్‌: 372 పోస్టులు6. క్రాఫ్ట్ టీచ‌ర్‌: 43 పోస్టులు7. మ్యూజిక్‌ టీచ‌ర్‌: 197 పోస్టులు8. స్టాఫ్‌ నర్సు: 533 పోస్టులు9. లైబ్రేరియన్ (పాఠ‌శాల‌లు): 256 పోస్టులుమొత్తం పోస్టులు: 7306
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 18.


 
 

తెలంగాణ గురుకులాల్లో 197 మ్యూజిక్ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివ‌రాలు
:1. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 92 పోస్టులు2. మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ‌ బ్యాక్‌వ‌ర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 52 పోస్టులు3. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 39 పోస్టులు4. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 14 పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 197వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
అర్హతలు: ఎస్సెస్సీతో ఇండియ‌న్ మ్యూజిక్‌లో డిప్లొమా లేదా డిగ్రీ. లేదా నాలుగేళ్ల స‌ర్టిఫికెట్ కోర్సుతో డిప్లొమా(లైట్ మ్యూజిక్‌). లేదా ఎంఏ ఫోక్ ఆర్ట్స్‌/ మాస్టర్ ఆఫ్ పెర్ఫామింగ్ ఆర్ట్స్‌. లేదా బ్యాచిల‌ర్ డిగ్రీతో పాటు డిప్లొమా క్లాసిక‌ల్ మ్యూజిక్ (క‌ర్ణాటిక్‌/ హిందుస్థానీ మ్యూజిక్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 20.04.2017.
చివరి తేది: 04.05.2017.

 
 

తెలంగాణ గురుకులాల్లో 256 లైబ్రేరియ‌న్‌ పోస్టులు (చివరి తేది: 06.05.2017)

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, బీసీ గురుకులాల్లో లైబ్రేరియ‌న్ (స్కూల్‌) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివ‌రాలు:
1. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 137
పోస్టులు2. మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ‌ బ్యాక్‌వ‌ర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 119 పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 256.
వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
అర్హతలు: డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణత అవ‌స‌రం.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 20.04.2017.
చివరి తేది: 06.05.2017.

 
 

తెలంగాణ గురుకులాల్లో 372 ఆర్ట్ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఆర్ట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివ‌రాలు
:1. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 63 పోస్టులు2. మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ‌ బ్యాక్‌వ‌ర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 69 పోస్టులు3. తెలంగాణ‌ మైనారిటీస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 195 పోస్టులు4. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 30 పోస్టులు5. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 15 పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 372.
వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
అర్హతలు: ఎస్సెస్సీ. ఆర్ట్స్ కోర్సులో డిప్లొమాతో పాటు (ఎ) ఫ్రీ హ్యాండ్ అవుట్‌లైన్‌, మోడ‌ల్ డ్రాయింగ్ (బి) డిజైన్ (సి) పెయింటింగ్‌. హ‌య్యర్ గ్రేడు డ్రాయింగులో టెక్నిక‌ల్ టీచ‌ర్స్ స‌ర్టిఫికెట్. డిప్లొమా (హోమ్ సైన్స్‌/ క్రాఫ్ట్ టెక్నాల‌జీ). లేదా బీఎఫ్ఏ (అప్లయిడ్ ఆర్ట్‌/ పెయింటింగ్/ స్కల్ప్‌చ‌ర్‌/ యానిమేష‌న్‌). లేదా బీఎఫ్ఏ (పెయింటింగ్, స్కల్ప్‌చ‌ర్‌, ప్రింట్ మేకింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 20.04.2017.
చివరి తేది: 04.05.2017.

 
 

తెలంగాణ గురుకులాల్లో 43 క్రాఫ్ట్‌ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో క్రాఫ్ట్‌ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివ‌రాలు
:1. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 03 పోస్టులు2. మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ‌ బ్యాక్‌వ‌ర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 26 పోస్టులు3. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 14 పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 43
అర్హతలు: ఎస్సెస్సీ. ఐటీఐ (వుడ్‌వ‌ర్క్‌/ టైల‌రింగ్‌/ బుక్‌బైండింగ్‌/ ఎంబ్రాయిడ‌రీ/ కార్పెంట‌ర్‌/ సీవింగ్ టెక్నాలజీ/ డ్రెస్ మేకింగ్‌). సంబంధిత ట్రేడులో హయ్యర్ గ్రేడు టెక్నిక‌ల్ టీచ‌ర్స్ స‌ర్టిఫికెట్‌. లేదా పాలిటెక్నిక్ డిప్లొమా (వుడ్‌వ‌ర్క్‌/ టైల‌రింగ్‌/ బుక్‌బైండింగ్‌/ ఎంబ్రాయిడ‌రీ/ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ/ గార్మెంట్‌ టెక్నాల‌జీ). సంబంధిత ట్రేడులో హయ్యర్ గ్రేడు టెక్నిక‌ల్ టీచ‌ర్స్ స‌ర్టిఫికెట్‌. లేదా డిప్లొమా (హోం సైన్స్/ క్రాఫ్ట్ టెక్నాల‌జీ). లేదా కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ(సీజీటీ)/ కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్, మేకింగ్(సీజీడీ&ఎం). లేదా ఫ్యాష‌న్‌, గార్మెంట్ మేకింగ్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 20.04.2017.
చివరి తేది: 04.05.2017.

 
 

తెలంగాణ గురుకులాల్లో 616 ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివ‌రాలు
:1. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 83 పోస్టులు2. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 182 పోస్టులు3. మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ‌ బ్యాక్‌వ‌ర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 135 పోస్టులు4. తెలంగాణ‌ మైనారిటీస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 194 పోస్టులు5. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 22 పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 616
వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
అర్హతలు: 50% మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌. లేదా ఇంట‌ర్‌తో పాటు స్కూల్‌/ కాలేజ్‌/ డిస్ట్రిక్ట్ లెవ‌ల్ స్పోర్ట్స్‌/ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి. లేదా 45% మార్కుల‌తో ఇంట‌ర్, స‌ర్టిఫికెట్‌/ యూజీ డిప్లొమా/ డిప్లొమా ఇన్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌. లేదా 50% మార్కుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ (ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌). లేదా 45% మార్కుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ తో పాటు నేష‌న‌ల్‌/ స్టేట్‌/ ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ పోటీల్లో పాల్గొని ఉండాలి. ఇందుకు ఏఐయూ లేదా ఐవోఏ గుర్తింపు త‌ప్పనిస‌రి. లేదా 40% మార్కుల‌తో మూడేళ్ల బీపీఈడీ. లేదా గ్రాడ్యుయేట్ పార్టిసిపేటెడ్ ఇన్ స్కూల్‌/ ఇంట‌ర్ కాలేజీయేట్ స్పోర్ట్స్‌, గేమ్స్‌/ ఎన్‌సీసీ-సీ స‌ర్టిఫికెట్ ఉత్తీర్ణత‌/ గ్రాడ్యుయేట్ రిప్రెజెంటెడ్ స్టేట్ యూనివ‌ర్సిటీ ఇన్ స్పోర్ట్స్‌, గేమ్స్‌, అథ్లెటిక్స్ త‌దిత‌రాల్లో ఎన్‌సీటీఈ రెగ్యులేష‌న్స్‌2007 ప్రకారం అర్హత ఉండాలి. లేదా ఏడాది బీపీఈడీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 20.04.2017.
చివరి తేది: 04.05.2017.

 
 

తెలంగాణ గురుకులాల్లో 921 పోస్ట్ గ్రాడ్యుయేట్‌ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో వివిధ స‌బ్జెక్టుల‌ల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్‌ టీచర్ (పీజీటీ)ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివ‌రాలు
:1. మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ‌ బ్యాక్‌వ‌ర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 83 పోస్టులు2. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 165 పోస్టులు3. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 136 పోస్టులు4. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 257 పోస్టులు5. తెలంగాణ‌ మైనారిటీస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 280 పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 921
వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
అర్హతలు: క‌నీసం 50% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టులో పీజీ. సంబంధిత మెథ‌డాల‌జీలో బీఈడీ లేదా బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 18.04.2017.
చివరి తేది: 04.05.2017.
ప్రాథ‌మిక‌ (స్క్రీనింగ్) ప‌రీక్ష: 28.05.2017.

 
 

నేష‌న‌ల్ సీడ్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 188 పోస్టులు (చివరి తేది: 06.05.17)

నేష‌న‌ల్ సీడ్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, డిప్లొమా ట్రెయినీ తదిత‌ర‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......1) అసిస్టెంట్ (లీగల్): 03 పోస్టులు2) మేనేజ్‌మెంట్ ట్రెయినీ: 63
3)
సీనియర్ ట్రెయినీ
: 40
4)
డిప్లొమా ట్రెయినీ
: 14
5)
ట్రెయినీ
: 68అర్హత: బీఎస్సీ/ బీఏ/ బీకామ్/ బీఎల్/ బీఈ/ బీటెక్/ ఎంబీఏ/ సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ /డిప్లొమా/ ఐటీఐ.
దరఖాస్తు: ఆన్‌లైన్
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 15.04.2017
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరి తేది: 06.05.2017

 

తెలంగాణ గురుకులాల్లో ఫిజిక‌ల్ డైరెక్టర్‌ పోస్టులు (చివరి తేది: 04.05.2017)

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ గురుకులాల్లో ఫిజిక‌ల్ డైరెక్టర్ (స్కూల్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివ‌రాలు
:తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 06 పోస్టులు
అర్హతలు: క‌నీసం 50శాతం మార్కుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ (ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌). లేదా 40% మార్కుల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీతో పాటు నేష‌న‌ల్‌/ స్టేట్‌/ ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ పోటీల్లో పాల్గొని ఉండాలి. ఇందుకు ఏఐయూ లేదా ఐవోఏ గుర్తింపు త‌ప్పనిస‌రి. లేదా 40% మార్కుల‌తో మూడేళ్ల బీపీఈడీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా డిగ్రీతో పాటు స్కూల్‌/ ఇంట‌ర్ కాలేజీయేట్ స్పోర్ట్స్‌, గేమ్స్‌/ ఎస్‌సీసీ-సీ స‌ర్టిఫికెట్‌/ స్పోర్ట్స్‌, గేమ్స్‌, టోర్నమెంట్స్‌లో గ్రాడ్యుయేట్ రిప్రెజెంట్ స్టేట్ యూనివ‌ర్సిటీ/ అడ్వంచ‌ర్ స్పోర్ట్స్‌లో బేసిక్ కోర్సు, త‌దిత‌రాల్లో ఉత్తీర్ణత‌ (ఎన్‌సీటీఈ రెగ్యులేష‌న్స్ 2002 ప్రకారం). బీపీఈడీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 18.04.2017.
చివరి తేది: 04.05.2017.

 
 

తెలంగాణ గురుకులాల్లో 4362 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ పోస్టులు (చివరి తేది: 04.05.2017)

తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల నియామకం కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో వివిధ స‌బ్జెక్టుల‌ల్లో ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీ)ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
గురుకులాల వారీగా ఖాళీల వివ‌రాలు
:1. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ: 74 పోస్టులు2. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 1281 పోస్టులు3. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 621 పోస్టులు4. మ‌హాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ‌ బ్యాక్‌వ‌ర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 1170 పోస్టులు5. తెలంగాణ‌ మైనారిటీస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్: 1216 పోస్టులుమొత్తం పోస్టుల సంఖ్య: 4362
వయసు: 01.07.2017 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
అర్హతలు: క‌నీసం 50% మార్కుల‌తో బీఏ/ బీఎస్సీ/ బీకాం. సంబంధిత మెథ‌డాల‌జీలో బీఈడీ. లేదా 50% మార్కుల‌తో నాలుగేళ్ల బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ(సంబంధిత మెథ‌డాల‌జీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఆప్షన‌ల్ స‌బ్జెక్టుగా సంబంధిత భాష‌లో డిగ్రీ లేదా డిగ్రీ (ఓరియంట‌ల్ లాంగ్వేజ్‌). లేదా లిట‌రేచ‌ర్ డిగ్రీ లేదా సంబంధిత భాష‌లో పీజీతో పాటు 50% మార్కుల‌తో లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ స‌ర్టిఫికెట్‌/ బీఈడీ (సంబంధిత మెథ‌డాల‌జీ). టీఎస్ టెట్‌/ ఏపీటెట్‌/ సీటెట్ (పేప‌ర్‌-II)లో ఉత్తీర్ణులై ఉండాలి.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 18.04.2017.
చివరి తేది: 04.05.2017.
ప్రాథ‌మిక‌ (స్క్రీనింగ్) ప‌రీక్ష తేది: 28.05.2017.

 
 

Friday, 7 April 2017

Jio Surprise News || Jio Offer Last Date || Jio New Announcement

లక్ష్మీవిలాస్ బ్యాంకులో పీవో పోస్టులు (చివరితేది: 17.04.2017)

లక్ష్మీ విలాస్ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* ప్రొబేషనరీ ఆఫీసర్
విభాగం: రిటైల్ బ్యాంకింగ్.
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి.
వయసు: 20 నుంచి 30 సంవ‌త్సరాల‌ మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత‌ప‌రీక్ష ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.650.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 17.04.2017.
ఆన్‌లైన్ రాతపరీక్ష తేది: మే నెల చివరివారంలో.



Sunday, 2 April 2017

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 400 పీవో పోస్టులు (చివ‌రితేది: 01.05.2017)

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీవో) పోస్టుల భ‌ర్తీకి, బ‌రోడాలోని మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ద్వారా పీజీ స‌ర్టిఫికేట్ (బ్యాంకింగ్ & ఫైనాన్స్‌) కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.......
* ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీవో): 400 పోస్టులు
కేటాయింపులు: ఆన్‌రిజ‌ర్వ్‌డ్‌-202, ఓబీసీ-108, ఎస్సీ-60, ఎస్టీ
-30.
కోర్సు: పీజీ స‌ర్టిఫికేట్ ఇన్ బ్యాంకింగ్ & ఫైనాన్స్‌
.
కోర్సు వ్యవ‌ధి: 9 నెల‌లు

అర్హత‌: 55 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు 50 శాతం మార్కులు స‌రిపోతాయి
.
వ‌యసు: 01-04-2017 నాటికి 20 -28 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి
.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ
.100).
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్‌, గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా
.
నియామ‌కం: 9 నెల‌ల శిక్షణ కాలం పూర్తయిన త‌ర్వాత బ్యాంకులో ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (జూనియ‌ర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్‌/స్కేల్‌-1) గా నియమిస్తారు
.
ముఖ్యమైన తేదీలు....

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
01.04.2017
* ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లింపు తేది:
01.04.2017 -01.05.2017
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది:
01.05.2017
* కాల్ లెట‌ర్ డౌన్‌లోడ్‌:
12.05.2017
* ఆన్‌లైన్ ప‌రీక్ష తేది: 27.05.2017