ఐదు నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు...........
ఐదు
నిమిషాల్లోనే ఛార్జింగ్
ఇంటర్నెట్
డెస్క్ ప్రత్యేకం: స్మార్ట్‌ఫోన్
వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన
సమస్య ఛార్జింగ్. ఫుల్‌గా ఛార్జింగ్
పెట్టినా ఐదారు గంటల్లో బ్యాటరీ
ఖాళీ అయిపోతుంది. ఒకసారి బ్యాటరీ
ఫుల్‌గా ఛార్జింగ్ చేయాలంటే
ఎంతలేదన్నా.. రెండు గంటలైనా
పడుతుంది. అయితే.. ఇకపై ఆ సమస్యను
అధిగమించడానికి చైనాకు చెందిన
మీడియాటెక్ అనే సంస్థ కొత్త
రకం ఛార్జర్లను రూపొందించింది.
‘పంప్
ఎక్స్‌ప్రెస్ 3.0’ పేరుతో రూపొందించిన
ఈ ఛార్జర్లతో ఐదు నిమిషాలు ఛార్జింగ్
పెడితే చాలు సుమారు 4 గంటలు ఎంచక్కా
ఫోన్ మాట్లాడుకోవచ్చట. కేవలం
20 నిమిషాల్లోనే 70శాతం ఛార్జింగ్
అవుతుందట. దీంతో ఛార్జింగ్
పెట్టినా స్మార్ట్‌ఫోన్ ఓవర్‌హీట్
అయ్యే అవకాశం ఉండదని చెబుతున్నారు.
అంతేకాదు.. బ్యాటరీకి.. స్మార్ట్‌ఫోన్‌కు
ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఛార్జర్లకు
పోటీగా దీన్ని రూపొందించినట్లు
తయారీదారులు చెబుతున్నారు.
ఈ ఏడాది చివరినాటికి ‘పంప్
ఎక్స్‌ప్రెస్ 3.0’ ఛార్జర్లు
మార్కెట్లోకి అందుబాటులోకి
రానున్నాయి
No comments:
Post a Comment