హైదరాబాద్: రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశంలోనే అత్యంత
ఎత్తు, పొడవైన జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ
దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ నగరం సంజీవయ్యపార్క్‌లో ఏర్పాటు చేసిన
అతిపెద్ద జాతీయజెండాను సీఎం తన సహచర మంత్రివర్గ సభ్యులతో కలిసి
ఆవిష్కరించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా 300 అడుగుల ఎత్తైన జెండా
స్తంభంపై 108 అడుగుల పొడవు, 72 అడుగుల వెడల్పుగల జాతీయపతాకం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.
No comments:
Post a Comment