Sunday, 16 October 2022

Diwali Special Offers || దీపావళి స్పెషల్ ఆఫర్స్ 19-10-2022 To 25-10-2022 Only

దీపాళి  స్పెల్ ర్   
పాన్ కార్డ్ అప్లై చేయబడును
కేవలం 250/-రూ. మాత్రమే
 

 డిజిటల్ పాస్ ఫొటోస్ ప్రింట్ ఇవ్వబడును.
8 ఫొటోకాపీలు 80/- రూ. మరియు
16 ఫొటోకాపీలు కేవలం 150/-రూ. మాత్రమే
 
స్కానింగ్ మరియు ఈమెయిల్
కేవలం 100/- రూ.కే
  మీ యొక్క విలువైన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, ఐడెంటిటి కార్డులు స్కాన్ చేసి మీ యొక్క ఈమెయిలు కి పంపించబడును.
(20డాక్యుమెంట్లు పరిమితి వరకు మాత్రమే
, అదనంగా ఒక్కో డాక్యుమెంట్ కి 10/- రూ అధికం)
 
 
మొబైల్ స్కీన్ గ్లాస్ వేయబడును
కేవలం 80/- రూ. మాత్రమే
 
అన్ని రకాల వాహనాలకు 
ఇన్సురెన్స్ చేయబడును

(ప్రతి ఇన్సూరెన్స్ కి 10% డిస్కౌంట్ చేయబడును)
 
 
సహారా ఇండియా పరివార్
ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్
  చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కి పాకెట్ క్యాలెండర్/డైరీ ఉచితంగా ఇవ్వబడును..
  
ల్యామినేషణ్ 

డాక్యుమెంట్లు, సర్టిఫికేట్ లు, ఐడెంట్టిటి కార్డులు
100/- రూ కే ల్యామినేషణ్
  చేయబడును...
(
A4 సైజ్ అయితే 5 , ID కార్డ్ సైజ్ అయితే 10 మాత్రమే )    


 క్యాష్ విత్ డ్రా, మని డిపాజిట్, మని ట్రాన్స్ఫర్ 1000/- కు పైన ట్రాన్జక్షన్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కి
లక్కి డ్రా కూపన్ ఇవ్వబడును
,
దీపావళి తరువాత రోజు లక్కి డ్రా ద్వార ముగ్గురు విజేతలకు ఆకర్షనీయమైన బహుమతి ఇవ్వబడును..


 పోలిస్ ఈ - చలాన్ పేమెంట్ చేయబడును


 ఆధార్ కార్డ్ డౌన్లోడ్ మరియు ప్రింట్  చేయబడును


 ఈ-శ్రామ్ లేబర్ కార్డ్ అప్లై కార్డ్ ప్రింట్  చేయబడును
 
Aeps, ఆన్లైన్ రిటైల్ సర్విస్ ఇవ్వబడును 
మొబైల్ యక్ససరిస్, ఎలక్ట్రికల్ వస్తువుల ప్రతి కొనుగోలు పై 10%  డిస్కౌంట్ ఇవ్వబడును
 
ఆహార భద్రత (రేషన్) కార్డు డౌన్లోడ్ & ప్రింట్ చేయబడును.
 
ఓటర్ ఐడికార్డు డౌన్లోడ్ & ప్రింట్ చేయబడును.
 
 డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయబడును మరియు  కార్డు డౌన్లోడ్ & ప్రింట్  చేయబడును.
 
 నేషనల్ హెల్త్ ఐ.డి కార్డు అప్లై చేసి కార్డు ప్రింట్ ఇవ్వబడును.
 
 
 
 

 


Tuesday, 26 July 2022

పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టుల భర్తీ...

 

దేశ రాజధాని ఢిల్లీలోని పోలీసు విభాగంలో.. కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ విద్యార్హతతో ఈ పోస్టులను దక్కించుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

·         మొత్తం పోస్టుల సంఖ్య: కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పురుషులు–1411

·         విభాగాల వారీగా ఖాళీలు: జనరల్‌–604, ఈడబ్ల్యూస్‌–142, ఓబీసీ–353, ఎస్సీ–262, ఎస్టీ–50.

·         అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత(10+2) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే హెవీ మోటార్‌ వెహికిల్స్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు వాహనాల నిర్వాహణపై అవగాహన ఉండాలి.

·         ఎత్తు: 170 సెంటీమీటర్లు ఉండాలి. ప్రత్యేక వర్గాలకు ఎత్తులో 5 సెంటీమీటర్లు సడలింపు ఉంటుంది. 

·         వయసు: 01–07.2022 నాటికి 21–30ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి. రిజర్వ్‌డ్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

వేతనాలు

·         పే లెవల్‌–3 ప్రకారంరూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనంగా పొందవచ్చు. 

ఎంపిక విధానం

·         కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) పరీక్ష, ఫిజికల్, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సీబీటీ

ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు–20 మార్కులు,జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 20 ప్రశ్నలు–20 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 10 ప్రశ్నలు–10 మార్కులు, రోడ్‌సెన్స్, వెహికిల్‌ మెయింటనన్స్,ట్రాఫిక్‌ రూల్స్‌/ సిగ్నల్‌ వెహికిల్, పర్యావరణ కాలుష్యం తదితర అంశాల నుంచి 50 ప్రశ్నలకు–50 మార్కులుంటాయి. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమా«ధానానికి 0.25శాతం మార్కులను కోతగా విధిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. సబ్జెక్ట్‌ పరమైన ప్రశ్నలన్నీ పదోతరగతి స్థాయి నుంచి వస్తాయి.

 

ట్రేడ్‌ టెస్ట్‌

·         ఈ టెస్ట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో లైట్‌ మోటార్‌ వెహికిల్‌కు సంబంధించి ఫార్వడ్, రివర్స్‌ డ్రైవింగ్‌కు 40 మార్కులు, పార్కింగ్‌ టెస్ట్‌కు 10 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అలాగే హెవీ మోటార్‌ వెహికిల్‌కు సంబంధించి కూడా ఫార్వడ్, రివర్స్‌ డ్రైవింగ్‌కు 40 మార్కులు, పార్కింగ్‌ టెస్ట్‌కు 10 మార్కులు చొప్పున కేటాయిస్తారు. దీంతోపాటు వాహన నిర్వహణకు సంబంధించి 25 మార్కులకు ట్రేడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.

·         మెడికల్‌ టెస్ట్‌ పరంగా ఎటువంటి దృష్టి లోపం ఉండకూడదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

·         హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, గుంటూరు, చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం

ముఖ్య సమాచారం

·         దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

·         దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహయింపు ఉంది.

·         దరఖాస్తులకు చివరి తేదీ: 29.07.2022

·         ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30.07.2022

·         సీబీటీ పరీక్ష తేదీ: 2022 అక్టోబర్‌లో 

·         వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

 

Saturday, 25 June 2022

కోల్‌ఇండియాలో 1050 పోస్టులు

 భారత ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ.. కోల్‌ ఇండియా లిమిటెడ్‌.. గేట్‌–2022 స్కోర్‌ ద్వారా మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 1050
పోస్టుల వివరాలు: మైనింగ్‌–699, సివిల్‌–160, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌–124, సిస్టమ్‌ అండ్‌ ఈడీపీ–67.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్‌ /బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత ఉండాలి. 
వయసు: 30ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 
వేతనం: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా ఎంపికైన వారికి ఈ2 గ్రేడ్‌ నెలకు రూ.50,000–1,60,000 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో సాధించిన వాలిడ్‌ గేట్‌ 2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2022
దరఖాస్తులకు చివరి తేది: 22.07.2022

వెబ్‌సైట్‌: https://www.coalindia.in

సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు

 కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌.. 11 ఎక్స్‌టర్నల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌–2)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఐటీ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై కంప్యూటర్స్‌లో డిగ్రీ,డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులైనవారు అర్హులు.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

రిజర్వేషన్‌: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను స్థానిక(ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల) అభ్యర్థులతో మిగిలిన 5 శాతం పోస్టులను అన్‌రిజర్వుడు కోటా కింద (తెలంగాణలోని అన్ని జిల్లాల వారితో) భర్తీ చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 20.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.07.2022

వెబ్‌సైట్‌: https://scclmines.com

ఇండియన్‌ నేవీలో 338 పోస్టులు

 ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా వివిధ ట్రేడుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 338
అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ ట్రేడ్‌ ఖాళీలు: ఎలక్ట్రీషియన్‌–49, ఎలక్ట్రోప్లేటర్‌–1,మెరైన్‌ ఇంజన్‌ ఫిట్టర్‌–36, ఫౌండ్రీ మ్యాన్‌–2, నమూనా మేకర్‌–2, మెకానిక్‌ డీజిల్‌–39, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌– 8, మెషినిస్ట్‌–15, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌–15, పెయింటర్‌–11, షీట్‌ మెటల్‌ వర్కర్‌–03, పైప్‌ ఫిట్టర్‌–22, మెకానిక్‌(ఏసీ, రిఫ్రిజిరేటర్‌)–08, టైలర్‌(జనరల్‌)–04, వెల్డర్‌(గ్యాస్, ఎలక్ట్రిక్‌)–23, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌–28, షిప్‌రైట్‌ వుడ్‌–21, ఫిట్టర్‌–05, మేసన్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్టర్‌–08, ఐ–సీటీఎస్‌ఎం–03, షిప్‌రైట్‌ స్టీల్‌–20, రిగ్గర్‌–14, ఫోర్జర్, హీట్‌ ట్రీటర్‌–01.
అర్హత: పదో తరగతి, ఐటీఐ(సంబంధిత ట్రేడ్‌) లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.08.2001 నుంచి 31.10.2008 మధ్య జన్మించినవారు అర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.07.2022

వెబ్‌సైట్‌: https://indiannavy.nic.in

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 325 పోస్టులు.

 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 325
పోస్టుల వివరాలు: రిలేషన్‌ల్‌షిప్‌ మేనేజర్లు–175, క్రెడిట్‌ అనలిస్టులు–150.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫైనాన్స్‌ విభాగంలో పీజీ డిగ్రీ/సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటì టేటివ్‌ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 22.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.07.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

ఐడీబీఐలో 226 పోస్టులు

 ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ).. వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 226
విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఎమర్జింగ్‌ పేమెంట్స్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లీగల్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆ«ధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 25.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.07.2022

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

Friday, 13 May 2022

Assam Rifles Recruitment: 1380 పోస్టులు

 షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం.. 2022 సంవత్సరానికి సంబంధించి టెక్నికల్‌ అండ్‌ ట్రేడ్స్‌మెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా.. గ్రూప్‌ బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు/మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 1380
ఖాళీల వివరాలు: బ్రిడ్జ్‌–రోడ్‌–17, క్లర్క్‌–287, రిలీజియన్‌ టీచర్‌–09,ఆపరేటర్‌ రేడియో అండ్‌ లైన్‌–729, రేడియో మెకానిక్‌–72,ఆర్మౌరర్‌–48, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌లు–13, నర్సింగ్‌ అసిస్టెంట్‌లు–100, వెటర్నరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు–15,ఆయా(పారా మెడికల్‌)–15, వాషర్‌మెన్‌–80.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.06.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.assamrifles.gov.in/