కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. 11 ఎక్స్‌టర్నల్ జూనియర్ అసిస్టెంట్(గ్రేడ్–2)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఐటీ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై కంప్యూటర్స్‌లో డిగ్రీ,డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణులైనవారు అర్హులు.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
రిజర్వేషన్: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను స్థానిక(ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల) అభ్యర్థులతో మిగిలిన 5 శాతం పోస్టులను అన్‌రిజర్వుడు కోటా కింద (తెలంగాణలోని అన్ని జిల్లాల వారితో) భర్తీ చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 20.06.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.07.2022
వెబ్‌సైట్: https://scclmines.com
No comments:
Post a Comment