Saturday, 25 June 2022

కోల్‌ఇండియాలో 1050 పోస్టులు

 భారత ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ.. కోల్‌ ఇండియా లిమిటెడ్‌.. గేట్‌–2022 స్కోర్‌ ద్వారా మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 1050
పోస్టుల వివరాలు: మైనింగ్‌–699, సివిల్‌–160, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌–124, సిస్టమ్‌ అండ్‌ ఈడీపీ–67.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్‌ /బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత ఉండాలి. 
వయసు: 30ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 
వేతనం: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా ఎంపికైన వారికి ఈ2 గ్రేడ్‌ నెలకు రూ.50,000–1,60,000 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో సాధించిన వాలిడ్‌ గేట్‌ 2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2022
దరఖాస్తులకు చివరి తేది: 22.07.2022

వెబ్‌సైట్‌: https://www.coalindia.in

సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు

 కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌.. 11 ఎక్స్‌టర్నల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌–2)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఐటీ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై కంప్యూటర్స్‌లో డిగ్రీ,డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్‌ కోర్సు ఉత్తీర్ణులైనవారు అర్హులు.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

రిజర్వేషన్‌: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను స్థానిక(ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల) అభ్యర్థులతో మిగిలిన 5 శాతం పోస్టులను అన్‌రిజర్వుడు కోటా కింద (తెలంగాణలోని అన్ని జిల్లాల వారితో) భర్తీ చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 20.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.07.2022

వెబ్‌సైట్‌: https://scclmines.com

ఇండియన్‌ నేవీలో 338 పోస్టులు

 ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా వివిధ ట్రేడుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 338
అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ ట్రేడ్‌ ఖాళీలు: ఎలక్ట్రీషియన్‌–49, ఎలక్ట్రోప్లేటర్‌–1,మెరైన్‌ ఇంజన్‌ ఫిట్టర్‌–36, ఫౌండ్రీ మ్యాన్‌–2, నమూనా మేకర్‌–2, మెకానిక్‌ డీజిల్‌–39, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌– 8, మెషినిస్ట్‌–15, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌–15, పెయింటర్‌–11, షీట్‌ మెటల్‌ వర్కర్‌–03, పైప్‌ ఫిట్టర్‌–22, మెకానిక్‌(ఏసీ, రిఫ్రిజిరేటర్‌)–08, టైలర్‌(జనరల్‌)–04, వెల్డర్‌(గ్యాస్, ఎలక్ట్రిక్‌)–23, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌–28, షిప్‌రైట్‌ వుడ్‌–21, ఫిట్టర్‌–05, మేసన్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్టర్‌–08, ఐ–సీటీఎస్‌ఎం–03, షిప్‌రైట్‌ స్టీల్‌–20, రిగ్గర్‌–14, ఫోర్జర్, హీట్‌ ట్రీటర్‌–01.
అర్హత: పదో తరగతి, ఐటీఐ(సంబంధిత ట్రేడ్‌) లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.08.2001 నుంచి 31.10.2008 మధ్య జన్మించినవారు అర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.07.2022

వెబ్‌సైట్‌: https://indiannavy.nic.in

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 325 పోస్టులు.

 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 325
పోస్టుల వివరాలు: రిలేషన్‌ల్‌షిప్‌ మేనేజర్లు–175, క్రెడిట్‌ అనలిస్టులు–150.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫైనాన్స్‌ విభాగంలో పీజీ డిగ్రీ/సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, సైకోమెట్రిక్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటì టేటివ్‌ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 22.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.07.2022

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

ఐడీబీఐలో 226 పోస్టులు

 ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ).. వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 226
విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఎమర్జింగ్‌ పేమెంట్స్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లీగల్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆ«ధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 25.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.07.2022

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/