Monday 4 March 2019

గ్రూప్-డి ఫలితాల వెల్లడి.. ఎంపికైనవారికి ఫిజికల్ ఈవెంట్స్ ఇలా...

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నిర్వహించిన గ్రూప్-డి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల నిరీక్షణకు సోమవారం (మార్చి 4) తెరపడింది. ఈ మేరకు సోమవారం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలను వెల్లడించింది. రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి పీఈటీ (ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్) నిర్వహించనున్నారు. ఇందులోనూ అర్హత పొందినవారికి చివరిదశలో ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్‌ల అనంతరం తుది ఫలితాలను వెల్లడించనున్నారు. అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 1.8 కోట్ల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి 

పీఈటీ పరీక్ష సాగేదిలా.. ✦ పురుష అభ్యర్థులు 35 కిలోల బరువును మోస్తూ..100 మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 120 సెకండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 1000 మీటర్ల పరుగును 255 సెకండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. 
✦ మహిళా అభ్యర్థులు 20 కిలోల బరువును మోస్తూ..100 మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 120 సెకండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 1000 మీటర్ల పరుగును 340 సెకండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. 
✦ పీఈటీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మూడో దశలో నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను హాజరుకావాల్సి ఉంటుంది. 
✦ అనంతరం అభ్యర్థులకు పోస్టింగ్ కేటాయిస్తారు.


డాక్యుమెంట్ వెరిఫికేషన్ - అవసరమైన పత్రాలు.. 
* ఆధార్ కార్డు 
* కుల ధ్రువీకరణ పత్రం 
* పుట్టినతేదీ ధ్రువపత్రం 
* పదోతరగతి సర్టిఫికేట్ 
* దివ్యాంగులైతే మెడికల్ సర్టిఫికేట్ 
* పైన పేర్కొన్న డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను సెల్ఫ్ అటెస్టెడ్ చేయించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment