Friday, 15 March 2019

తెలంగాణ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో స్టాఫ్ కార్ డ్రైవ‌ర్ పోస్టులు (చివ‌రితేది: 30.03.19)

హైద‌రాబాద్‌లోని మెయిల్ మోటార్ స‌ర్వీస్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* స్టాఫ్ కార్ డ్రైవ‌ర్ (ఆర్డిన‌రీ గ్రేడ్‌)* మొత్తం ఖాళీలు: 03అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు లైట్ & హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ క‌లిగి ఉండాలి.వ‌య‌:ప‌రిమితి: 18 - 27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: సింపుల్ అర్థ‌మాటిక్ టెస్ట్‌, వాహ‌న మెకానిజం, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివ‌రితేది: 30.03.2019.చిరునామా: The Manager, Mail Motor Service, Koti, Hyderabad - 500 095.

Monday, 4 March 2019

ఈఎస్‌ఐసీలో స్టెనోగ్రాఫర్, క్లర్క్ పోస్టులు

న్యూఢిల్లీలోని ఎంప్లాయ్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఈఎస్‌ఐసీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా తమిళనాడు రీజియన్‌లో స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించి.. మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌‌మెన్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఎంపికైనవారికి నెలకు రూ.25,500 ప్రారంభవేతనం ఉంటుంది. 

పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య

✪ స్టెనోగ్రాఫర్: 20

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంగ్లిష్/హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. 

✪ అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ): 131 

అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. 

వయోపరిమితి: 15.04.2019 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌‌మెన్ 
అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్/ ఈ చలానా ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: స్టెనోగ్రఫీ పోస్టులకు రాతపరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ నిర్వహిస్తారు. యూడీసీ పోస్టులకు ప్రిలిమినరీ, 
మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. 

ముఖ్యమైన తేదీలు.. 

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.03.2019. 

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2019. 
Notification 

Website 

గ్రూప్-డి ఫలితాల వెల్లడి.. ఎంపికైనవారికి ఫిజికల్ ఈవెంట్స్ ఇలా...

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నిర్వహించిన గ్రూప్-డి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల నిరీక్షణకు సోమవారం (మార్చి 4) తెరపడింది. ఈ మేరకు సోమవారం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలను వెల్లడించింది. రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి పీఈటీ (ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్) నిర్వహించనున్నారు. ఇందులోనూ అర్హత పొందినవారికి చివరిదశలో ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్‌ల అనంతరం తుది ఫలితాలను వెల్లడించనున్నారు. అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 1.8 కోట్ల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి 

పీఈటీ పరీక్ష సాగేదిలా.. ✦ పురుష అభ్యర్థులు 35 కిలోల బరువును మోస్తూ..100 మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 120 సెకండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 1000 మీటర్ల పరుగును 255 సెకండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. 
✦ మహిళా అభ్యర్థులు 20 కిలోల బరువును మోస్తూ..100 మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 120 సెకండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 1000 మీటర్ల పరుగును 340 సెకండ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. 
✦ పీఈటీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మూడో దశలో నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను హాజరుకావాల్సి ఉంటుంది. 
✦ అనంతరం అభ్యర్థులకు పోస్టింగ్ కేటాయిస్తారు.


డాక్యుమెంట్ వెరిఫికేషన్ - అవసరమైన పత్రాలు.. 
* ఆధార్ కార్డు 
* కుల ధ్రువీకరణ పత్రం 
* పుట్టినతేదీ ధ్రువపత్రం 
* పదోతరగతి సర్టిఫికేట్ 
* దివ్యాంగులైతే మెడికల్ సర్టిఫికేట్ 
* పైన పేర్కొన్న డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను సెల్ఫ్ అటెస్టెడ్ చేయించాల్సి ఉంటుంది.

Sunday, 3 March 2019

రైల్వేలో 1937 పారామెడిక‌ల్ కేట‌గిరీ పోస్టులు (చివ‌రితేది: 02.04.19)

భార‌తీయ రైల్వే పారామెడిక‌ల్ కేట‌గిరీ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు ఆయా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ)ల ద్వారా భ‌ర్తీ కానున్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య‌1937. వీటిలో బెంగ‌ళూరు-51, భువ‌నేశ్వ‌ర్‌-35, చెన్నై-173, సికింద్రాబాద్‌-112 ఉన్నాయి.
1) డైటీషియ‌న్‌
: 04
2) 
స్టాఫ్ న‌ర్స్‌
: 1109
3) 
డెంట‌ల్ హైజీనిస్ట్
: 05
4) 
డ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్‌
: 20
5) 
ఎక్స్‌టెన్ష‌న్ ఎడ్యుకేట‌ర్‌
: 11
6) 
హెల్త్ అండ్ మ‌లేరియా ఇన్‌స్పెక్ట‌ర్ (గ్రేడ్
 3): 289
7) 
ల్యాబ్ సూప‌రింటెండెంట్ (గ్రేడ్
 3): 25
8) 
ఆప్టోమెట్రిస్ట్
: 06
9) 
పెర్‌ఫ్యూజ‌నిస్ట్
: 01
10) 
ఫిజియోథెర‌పిస్ట్
: 21
11) 
ఫార్మ‌సిస్ట్ (గ్రేడ్
 3): 277
12) 
రేడియోగ్రాఫ‌ర్‌
: 61
13) 
స్పీచ్ థెర‌పిస్ట్‌
: 01
14) 
ఈసీజీ టెక్నీషియ‌న్‌
: 23
15) 
లేడీ హెల్త్ విజిట‌ర్‌
: 02
16) 
ల్యాబ్ సూప‌రింటెండెంట్ (గ్రేడ్
 2): 82అర్హ‌త‌వ‌య‌సుఆయా పోస్టుల‌ను అనుస‌రించి ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన విధంగా.
ఎంపిక‌క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా.
రాత‌పరీక్ష తేది2019 జూన్ మొద‌టివారంలో జ‌రిగే అవ‌కాశం ఉంది.
ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్‌
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రితేది02.04.2019
ద‌ర‌ఖాస్తు ఫీజు ఆఫ్‌లైన్ పేమెంట్‌కు చివ‌రితేది: 04.04.2019
ద‌ర‌ఖాస్తు ఫీజు ఆన్‌లైన్ పేమెంట్‌కు చివ‌రితేది: 05.04.2019
ఆన్‌లైన్ ద‌రఖాస్తు తుది స‌మ‌ర్ప‌ణ గ‌డువు07.04.2019
 
 

రైల్వేలో 35,277 నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ పోస్టులు (చివ‌రితేది: 31.03.19)

భార‌తీయ రైల్వే నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ (ఎన్‌టీపీసీ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ)ల ద్వారా ఈ పోస్టులు భ‌ర్తీ కానున్నాయి.వివ‌రాలు.....* నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ (ఎన్‌టీపీసీ) పోస్టులుమొత్తం ఖాళీలు: 35,277 (వీటిలో సికింద్రాబాద్‌కు 3234 పోస్టులు కేటాయించారు).1) అండ‌ర్ గ్రాడ్యుయేట్ పోస్టులు: 10,628ఎ) జూనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్: 4319బి) అకౌంట్స్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్: 760సి) జూనియ‌ర్ టైమ్ కీప‌ర్‌: 17డి) ట్రైన్స్ క్ల‌ర్క్‌: 592ఇ) క‌మ‌ర్షియ‌ల్ కమ్ టికెట్ క్ల‌ర్క్‌: 4940అర్హ‌త‌: ఇంట‌ర్‌ ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌రుపై ఇంగ్లిష్/ హిందీ టైపింగ్ ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.2) గ్రాడ్యుయేట్ పోస్టులు: 24,649ఎ) ట్రాఫిక్ అసిస్టెంట్‌: 88బి) గూడ్స్ గార్డ్: 5748సి) సీనియ‌ర్ క‌మ‌ర్షియ‌ల్ క‌మ్ టికెట్ క్ల‌ర్క్‌: 5638డి) సీనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్: 2873ఇ) జూనియ‌ర్ అకౌంట్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్: 3164ఎఫ్‌) సీనియ‌ర్ టైమ్ కీప‌ర్‌: 14జి) క‌మ‌ర్షియ‌ల్ అప్రెంటిస్‌: 259హెచ్‌) స్టేష‌న్ మాస్ట‌ర్‌: 6865అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌రుపై ఇంగ్లిష్/ హిందీ టైపింగ్ ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.వ‌య‌సు: 18-33 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రెండంచెల‌ క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఆప్టిట్యూడ్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామ్ ఆధారంగా.మొదటి విడ‌త సీబీటీ తేది: 2019 జూన్ - సెప్టెంబ‌రు మ‌ధ్య‌లో జ‌ర‌గ‌వ‌చ్చు.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌లు, ట్రాన్స్‌జెండ‌ర్‌, ఈబీసీ, మైనారిటీల‌కు రూ.250. మిగిలిన‌వారికి రూ.500.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.03.2019ఫీజు చెల్లింపున‌కు చివ‌రితేది: 05.04.2019ద‌ర‌ఖాస్తుల‌ తుది స‌మ‌ర్ప‌ణ‌: 12.04.2019