Thursday 25 January 2018

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్లో 267 పోస్టులు

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్లో 267 పోస్టులు

తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్)... 153 అసిస్టెంట్ ఇంజనీర్, 114 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రెండు వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది.
Jobsపోస్టు-ఖాళీలు: అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)-153 (ఎలక్ట్రికల్-133+సివిల్-20); జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏవో)-114.
వేతన శ్రేణి: ఏఈ-రూ.41,155-రూ.63,600; జేఏవో-రూ.34,630-రూ.56,760.
అర్హతలు: ఏఈ పోస్టులకు ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/సివిల్‌లో బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఏఎంఐఈ ఎగ్జామినేషన్‌లో సెక్షన్ ఏ, బీ ఉత్తీర్ణత/తత్సమాన అర్హత; జేఏవో పోస్టులకు బీకామ్/ఎంకామ్‌లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ-ఇంటర్‌లో ఉత్తీర్ణత.
వయసు: 2018, జనవరి 1 నాటికి 18-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుం: రూ.220 (అప్లికేషన్ ఫీ-రూ.100+ఎగ్జామినేషన్ ఫీ-రూ.120); ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ కేటగిరీలకు ఎగ్జామినేషన్ ఫీ నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా ఎంపిక నిర్వహిస్తారు.
రాతపరీక్ష విధానం: ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు సెక్షన్ ఏ, సెక్షన్ బీ ఉంటాయి. సెక్షన్ ఏలో సంబంధిత విభాగం నుంచి 80 ప్రశ్నలు, సెక్షన్ బీలో జనరల్ అవేర్‌నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి 2గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుల ప్రారంభం: ఫిబ్రవరి 2, 2018.
దరఖాస్తుల ముగింపు: ఫిబ్రవరి 19, 2018.
పరీక్ష తేదీ: మార్చి 25, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tssouthernpower.com, tssouthernpower.cgg.gov.in

No comments:

Post a Comment