ఇండియన్ ఆర్మీలో 191 ఉద్యోగాలు
ఇండియన్
ఆర్మీలోని 191 ఖాళీలను చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అక్టోబర్
2018లో ప్రారంభమయ్యే పురుషుల 51వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్), మహిళల 22వ
షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సుల ద్వారా భర్తీ చేసేందుకు అవివాహ
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన
వెలువడింది. మొత్తం పోస్టుల్లో 190 టెక్నికల్‌వి, ఒకటి నాన్ టెక్నికల్.
వీటిలో డిఫెన్స్ పర్సన్స్ విడోస్‌కు టెక్నికల్, నాన్ టెక్నికల్ నుంచి
ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.
|
కోర్సులు: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) టెక్నికల్/నాన్‌టెక్నికల్.
విభాగాల వారీ ఖాళీలు: సివిల్-53 (పురుషులు-49, మహిళలు-4), మెకానికల్-19 (పురుషులు-16, మహిళలు-3), ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-24 (పురుషులు-22, మహిళలు-2), ఏరోనాటికల్/ఏవియేషన్/బాలిస్టిక్స్/ఏవియానిక్స్-12 (పురుషులు), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్)- 34 (పురుషులు-31, మహిళలు-3), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/శాటిలైట్ కమ్యూనికేషన్-30 (పురుషులు-28, మహిళలు-2), ఎలక్ట్రానిక్స్/ఆప్టో ఎలక్ట్రానిక్స్/ఫైబర్ ఆప్టిక్స్/మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్-11 (పురుషులు), ప్రొడక్షన్ ఇంజనీరింగ్-3 (పురుషులు), ఆర్కిటెక్చర్/బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ-3 (పురుషులు). విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్‌కు ఎస్‌ఎస్‌సీ (నాన్ టెక్నికల్) (నాన్ యూపీఎస్సీ)-1, ఎస్‌ఎస్‌సీ (టెక్నికల్)-1. అర్హతలు: ఎస్‌ఎస్‌సీ (టెక్నికల్)కు సంబంధిత విభాగాలను బట్టి బీఈ/బీటెక్; ఎస్‌ఎస్‌సీ (నాన్ టెక్నికల్) (నాన్ యూపీఎస్సీ)కి డిగ్రీ. వయసు: ఎస్‌ఎస్‌సీ (టెక్నికల్)కు 20-27 ఏళ్ల లోపు ఉండాలి; ఎస్‌ఎస్‌సీ (నాన్ టెక్నికల్)కు 35 ఏళ్లు మించకూడదు. శారీరక ప్రమాణాలు: ఎత్తు-పురుషులకు 157.5 సెం.మీ.; ఎత్తుకు అనుగుణంగా బరువు ఉండాలి. అలాగే తగిన శారీరక, మానసిక ఆరోగ్యం తప్పనిసరి. టాటూ (పచ్చబొట్లు) ఉండకూడదు. దేహ దారుఢ్య పరీక్ష: ఇందులో 2.4 కి.మీ.ల దూరాన్ని 15 నిమిషాల్లో పరిగెత్తగలగాలి. అలాగే నిర్దేశిత సమయానికి 13 పుషప్స్, 25 సిటప్స్, 6 చిన్ అప్స్ చేయగలగాలి. 3-4 మీ. రోప్ క్లైంబింగ్ పూర్తిచేయగలగాలి. ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ (రెండు దశల్లో ఉంటుంది), మెడికల్ ఎగ్జామినేషన్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్స్ పోస్టులకు ఆఫ్‌లైన్). దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2018 (విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్స్‌కు చివరి తేదీ- మార్చి 31, 2018). పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in |
No comments:
Post a Comment