వ్యవసాయ సీట్లకు 6న స్పాట్ కౌన్సెలింగ్
వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ (ఫిషరీస్) డిగ్రీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న జనరల్, ఎన్‌ఆర్‌ఐ, సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్ల భర్తీకి ఈ నెల 6న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ శివాజీ శనివారం తెలిపారు. జనరల్ కోటాలోని సీట్ల భర్తీకి జనవరి 6న ఉదయం 10 గంటలకు రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఎన్‌ఆర్‌ఐ, సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్ల భర్తీకి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. టీజీ ఈఏపీసెట్-2024లో ర్యాంకులు పొంది, ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చన్నారు. వివిధ కోర్సుల్లోని ఖాళీలు, ఫీజులు, ఇతర వివరాలను www.pjtsau.edu.in లో చూడవచ్చన్నారు
No comments:
Post a Comment