Bank of Baroda SO: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా… వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 17వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
పోస్టులు: అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్, మేనేజర్ - సేల్స్, మేనేజర్ - క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ - క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్- ఎంఎస్‌ఎంఈ రిలేషన్ షిప్, హెడ్ - ఎస్‌ఎంఈ సెల్, ఆఫీసర్ - సెక్యూరిటీ అనలిస్ట్, మేనేజర్ - సెక్యూరిటీ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ - సెక్యూరిటీ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్- సివిల్ ఇంజినీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్- సివిల్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్ ఆర్కిటెక్ట్, సీనియర్ మేనేజర్ - సి&ఐసి రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ - సి&ఐసి క్రెడిట్ అనలిస్ట్ తదితరాలు.
మొత్తం పోస్టుల సంఖ్య: 1267.
విభాగాలు: రూరల్ & అగ్రి బ్యాంకింగ్, రిటైల్ లియేబిలిటీస్, ఎంఎస్‌ఎంఈ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, పీహెచ్‌డీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ టెస్ట్ సబ్జెక్టులు: రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ (75 ప్రశ్నలు- 150 మార్కులు).
ప్రశ్నల సంఖ్య: 150. గరిష్ఠ మార్కులు: 225. వ్యవధి: 150 నిమిషాలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.600, అప్లికేబుల్ ట్యాక్సెస్. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు రూ.100, అప్లికేబుల్ ట్యాక్సెస్.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.12.2024.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 17-01-2025.
ముఖ్యాంశాలు:
* వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
*అర్హులైన అభ్యర్థులు జనవరి 17వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
No comments:
Post a Comment