Saturday, 4 January 2025

నేటి నుంచి టీసీసీ హాల్‌టికెట్లు

 నేటి నుంచి టీసీసీ హాల్‌టికెట్లు

రాష్ట్రంలో ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు(టీసీసీ) పరీక్షల హాల్‌టికెట్లు ఆదివారం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16,757 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని, అందుకు 93 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


పీజీ యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటాకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌

 పీజీ యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటాకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌

పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటాల కింద మొదటి ఫేజ్‌లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునేందుకు కాళోజీ వర్సిటీ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ మైనారిటీయేతర, మైనారిటీ వైద్య కళాశాలల్లో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు జనవరి 4 మధ్యాహ్నం 2 గంటల నుంచి జనవరి 6 మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ఆప్షన్లు పెట్టుకోవాలని వర్సిటీ సూచించింది. వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.


వ్యవసాయ సీట్లకు 6న స్పాట్‌ కౌన్సెలింగ్‌

 వ్యవసాయ సీట్లకు 6న స్పాట్‌ కౌన్సెలింగ్‌

వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ (ఫిషరీస్‌) డిగ్రీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న జనరల్, ఎన్‌ఆర్‌ఐ, సెల్ఫ్‌ఫైనాన్స్‌ సీట్ల భర్తీకి ఈ నెల 6న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ శివాజీ శనివారం తెలిపారు. జనరల్‌ కోటాలోని సీట్ల భర్తీకి జనవరి 6న ఉదయం 10 గంటలకు రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ జరుగుతుందన్నారు. ఎన్‌ఆర్‌ఐ, సెల్ఫ్‌ఫైనాన్స్‌ సీట్ల భర్తీకి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. టీజీ ఈఏపీసెట్‌-2024లో ర్యాంకులు పొంది, ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చన్నారు. వివిధ కోర్సుల్లోని ఖాళీలు, ఫీజులు, ఇతర  వివరాలను www.pjtsau.edu.in లో చూడవచ్చన్నారు

ఎస్‌బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

 SBI Probationary Officer: ఎస్‌బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్...  పీవో ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 27.12.2024 నుంచి 16.01.2025 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పీవోగా ఎంపికైతే రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ప్రకటన వివరాలు:

★  ప్రొబేషనరీ ఆఫీసర్: 600 పోస్టులు (ఎస్సీ- 87, ఎస్టీ- 57, ఓబీసీ- 158, ఈడబ్ల్యూఎస్‌- 58, యూఆర్‌- 240)

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం ఫైనల్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి (01.04.2024 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీత భత్యాలు: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష అంశాలు: ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ ఎబిలిటీ (30 ప్రశ్నలు).

మొత్తం ప్రశ్నల సంఖ్య: 100. గరిష్ఠ మార్కులు: 100. పరీక్ష వ్యవధి: 1 గంట.

మెయిన్స్‌ సబ్జెక్టులు: రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 60 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ (30 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్ అవేర్‌నెస్/ ఎకానమీ/ బ్యాంకింగ్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్- 420 ప్రశ్నలు మార్కులు).

మొత్తం ప్రశ్నల సంఖ్య: 170. గరిష్ఠ మార్కులు: 200. పరీక్ష వ్యవధి: 3 గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చిత్తూరు, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాలు: గుంటూరు/ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 27.12.2024 నుంచి 16.01.2025 వరకు.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 27.12.2024 నుంచి 16.01.2025 వరకు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2025, ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభం.

స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2025, మార్చి 8, 15.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: ఏప్రిల్‌ 2025.

మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2025, ఏప్రిల్‌ రెండో వారం.

స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: 2025, ఏప్రిల్‌/ మే.

ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: మే/ జూన్‌ 2025.

ఫేజ్-3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: మే/ జూన్‌, 2025.

ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: మే/ జూన్‌, 2025.

ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: మే/ జూన్‌, 2025.

తుది ఫలితాల ప్రకటన: మే/ జూన్‌, 2025.


ముఖ్యాంశాలు:

★ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- పీవో ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

★ ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 27.12.2024 నుంచి 16.01.2025 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. 

★ అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

 Bank of Baroda SO: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 

బ్యాంక్ ఆఫ్ బరోడా… వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 17వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

ఖాళీల వివరాలు:

పోస్టులు: అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్, మేనేజర్ - సేల్స్, మేనేజర్ - క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ - క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్- ఎంఎస్‌ఎంఈ రిలేషన్ షిప్, హెడ్ - ఎస్‌ఎంఈ సెల్, ఆఫీసర్ - సెక్యూరిటీ అనలిస్ట్, మేనేజర్ - సెక్యూరిటీ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ - సెక్యూరిటీ అనలిస్ట్‌, టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్- సివిల్ ఇంజినీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్- సివిల్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, టెక్నికల్ మేనేజర్ ఆర్కిటెక్ట్, సీనియర్ మేనేజర్ - సి&ఐసి రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ - సి&ఐసి క్రెడిట్ అనలిస్ట్ తదితరాలు.

మొత్తం పోస్టుల సంఖ్య: 1267.

విభాగాలు: రూరల్ & అగ్రి బ్యాంకింగ్, రిటైల్ లియేబిలిటీస్‌, ఎంఎస్‌ఎంఈ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, పీహెచ్‌డీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ టెస్ట్ సబ్జెక్టులు: రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ (75 ప్రశ్నలు- 150 మార్కులు).

ప్రశ్నల సంఖ్య: 150. గరిష్ఠ మార్కులు: 225. వ్యవధి: 150 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.600, అప్లికేబుల్‌ ట్యాక్సెస్‌. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు రూ.100, అప్లికేబుల్‌ ట్యాక్సెస్‌.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.12.2024.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 17-01-2025.

​​​

ముఖ్యాంశాలు:

* వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

*అర్హులైన అభ్యర్థులు జనవరి 17వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

5,6,7,8,9 వ తరగతి గురుకుల పాఠశాల లో ప్రవేశ పరీక్ష

 5,6,7,8,9 వ తరగతి గురుకుల పాఠశాల లో ప్రవేశ పరీక్ష కొరకై మా వద్ద ఆన్లైన్ అప్లికేషన్ చేయబడును.

దరఖాస్తుకు కావలసినవి: 

1. క్యాస్ట్ సర్టిఫికెట్

2. ఇన్కమ్ సర్టిఫికెట్

3. బర్త్ సర్టిఫికెట్

4. బోనాఫైడ్ సర్టిఫికెట్

5. ఫోటో

6. ఆధార్ కార్డు

7. ఫోన్ నెంబర్

అప్లికేషన్ ప్రింట్ తో పాటు హాల్ టికెట్ కూడా వెంటనే డౌన్లోడ్ చేసి ఇవ్వబడును


పూర్తి వివరాలకు సంప్రదించండి


పవన్ ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్

డిజిటల్ సేవా కేంద్రం - కొండపల్లి

సెల్: 8885281808

తెలంగాణ హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు

 TGHC:  తెలంగాణ హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు 

తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 




స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్‌, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్‌,  కంప్యూటర్‌ అపరేటర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌ పోస్టుల కోసం  అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 1673, వాటిలో 1277 టెక్నికల్, 184 నాన్-టెక్నికల్ , తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద 212 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.


పోస్టు పేరు - ఖాళీలు 

తెలంగాణ హైకోర్టు పరిధిలో

1. కోర్టు మాస్టర్‌ అండ్ పర్సనల్ సెక్రటేరియస్‌:  12

2. కంప్యూటర్‌ అపరేటర్‌: 11

3. అసిస్టెంట్: 42

4. ఎగ్జామినర్‌: 24

6. టైపిస్ట్: 12

7. కాపిస్ట్: 16

8. సిస్టమ్‌ అనలిస్ట్: 20

9. ఆఫీస్‌ సబార్డినేట్ : 75

మొత్తం పోస్టుల సంఖ్య: 212

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో

☞ నాన్‌ - టెక్నికల్: 1277

☞ టెక్నికల్: 184

మొత్తం పోస్టుల సంఖ్య: 1461

మొత్తం ఖాళీలు: 1673

అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 - 34 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్టీ/ ఎస్సీ/ ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీఎస్‌ అభ్యర్థులకు రూ.400.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష,  మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్‌ ఇంగ్లిష్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08-01-2025

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31-01-2025

పరీక్ష తేదీలు: టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్, నాన్‌ టెక్నికల్ పోస్టులకు జూన్‌ 2025

TS EPASS SCHOLARSHIP EXTENDED UPTO 31-03-2025