Sunday 24 March 2024

IIITH: ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్

 


హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- ఎంటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (పీజీఈఈ) 2024 ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు.

ప్రోగ్రామ్ వివరాలు:

1. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్‌) ప్రోగ్రామ్: రెండేళ్ల వ్యవధి

2. మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రిసెర్చ్ (ఎంఎస్‌): రెండేళ్ల వ్యవధి

3. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) ప్రోగ్రామ్‌: అయిదేళ్ల వ్యవధి

విభాగాలు: ఎంటెక్‌- సీఎస్‌ఈ, సీఎస్‌ఐఎస్‌, సీఏఎస్‌ఈ, పీడీఎం; ఎంఎస్‌- సీఎస్‌ఈ, ఈసీఈ, సీఈ, బీఐవో; పీహెచ్‌డీ- సీఎల్‌, సీఎన్‌ఎస్‌, ఎస్‌ఐ, సీఎస్‌, హెచ్‌ఎస్‌.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, బీఎస్సీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎండీ ఉత్తీర్ణులై ఉండాలి.  

ఎంపిక ప్రక్రియ: పీజీఈఈ 2024, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.2,500. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01-04-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 04-05-2024.

ఇంటర్వ్యూ తేదీలు: ఎంఎస్‌ ప్రోగ్రామ్‌ 05, 06-06-2024. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ 07, 08-06-2024.


No comments:

Post a Comment