Sunday, 24 March 2024

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2024

 


తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2024 నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమైంది. టెట్‌ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ ప్రకారం మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించనుంది. అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్‌ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

పరీక్ష వివరాలు...

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2024

అర్హతలు: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు. 

* టెట్‌ పేపర్‌-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్‌ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్‌ అభ్యర్థులకు ఇంటర్‌లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే.  

టెట్‌ పేపర్‌-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్‌ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ రాయవచ్చు.\

పరీక్ష విధానం: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. జనరల్‌ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్‌ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు. 

దరఖాస్తు ఫీజు: ఒక పేపర్‌ రాస్తే రూ.వెయ్యి; రెండు పేపర్లు రాస్తే రూ.2,000 ఫీజు చెల్లించాలి.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం: మే 15 నుంచి.

పరీక్ష తేదీలు: మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ జరుగుతుంది. 

పరీక్ష సమయం: పేపర్‌-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుంది. 

పరీక్ష ఫలితాలు విడుదల తేదీ: జూన్‌ 12.

టెట్‌ కార్యాలయం టెలిఫోన్ నంబర్‌: 7075701763/ 64

డొమైన్ సంబంధిత సమస్యల కోసం హెల్ప్‌డెస్క్ నంబర్‌: 7075701768/ 84

సాంకేతిక సంబంధిత సమస్యల కోసం హెల్ప్‌డెస్క్ నంబర్‌: 7032901383


No comments:

Post a Comment