Sunday 24 March 2024

తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలలో యూజీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సు

 

తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలలో యూజీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సు 

మిలిటరీ ఎడ్యుకేషన్‌, త్రివిధ దళాల్లో ఉద్యోగ కల్పనే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి(బీబీనగర్‌)లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌ను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రత్యేకంగా ప్రారంభించింది. ఈ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం యూజీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్) కోర్సుల్లో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

కోర్సు వివరాలు:

1. యూజీ కోర్సులు (బీఎస్సీ- ఎంపీసీ/ ఎంఎస్‌సీఎస్‌/ బీజడ్‌సీ/ ఎంజడ్‌సీ; బీకాం కంప్యూటర్స్‌/ బీఏ హెచ్‌ఈపీ): 240 సీట్లు 

2. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ- ఎకనామిక్స్ కోర్సు: 40 సీట్లు

బోధనా మాధ్యమం: ఆంగ్ల మాధ్యమం.

సంస్థ పేరు: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌, భువనగిరి/ బీబీనగర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా.

అర్హత: 2023-24లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. ఎత్తు కనీసం 152 సెం.మీ ఉండాలి. వయసు 16- 18 ఏళ్ల మధ్య ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఫిజికల్ టెస్ట్, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, సైకో అనలిటికల్‌ అండ్‌ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్‌), మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 15.04.2024.

హాల్ టిక్కెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం: 27.04.2024.

స్టేజ్-I రాత పరీక్ష తేదీ: 06.05.2024.

స్టేజ్-II స్క్రీనింగ్ టెస్ట్‌ తేదీలు: 24, 25, 27, 28, 29, 30, 31.05.2024, 01.06.2024.

No comments:

Post a Comment