Sunday, 24 March 2024
IIITH: ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (పీజీఈఈ) 2024 ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు.
ప్రోగ్రామ్ వివరాలు:
1. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్) ప్రోగ్రామ్: రెండేళ్ల వ్యవధి
2. మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రిసెర్చ్ (ఎంఎస్): రెండేళ్ల వ్యవధి
3. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) ప్రోగ్రామ్: అయిదేళ్ల వ్యవధి
విభాగాలు: ఎంటెక్- సీఎస్‌ఈ, సీఎస్‌ఐఎస్, సీఏఎస్‌ఈ, పీడీఎం; ఎంఎస్- సీఎస్‌ఈ, ఈసీఈ, సీఈ, బీఐవో; పీహెచ్‌డీ- సీఎల్, సీఎన్‌ఎస్, ఎస్‌ఐ, సీఎస్, హెచ్‌ఎస్.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎండీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పీజీఈఈ 2024, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.2,500.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-04-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 04-05-2024.
ఇంటర్వ్యూ తేదీలు: ఎంఎస్ ప్రోగ్రామ్ 05, 06-06-2024. పీహెచ్‌డీ ప్రోగ్రామ్ 07, 08-06-2024.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024 నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమైంది. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ప్రకారం మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనుంది. అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్‌ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.
పరీక్ష వివరాలు...
* తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024
అర్హతలు: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు.
* టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే.
* టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.\
పరీక్ష విధానం: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. జనరల్ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.
దరఖాస్తు ఫీజు: ఒక పేపర్ రాస్తే రూ.వెయ్యి; రెండు పేపర్లు రాస్తే రూ.2,000 ఫీజు చెల్లించాలి.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: మే 15 నుంచి.
పరీక్ష తేదీలు: మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది.
పరీక్ష సమయం: పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుంది.
పరీక్ష ఫలితాలు విడుదల తేదీ: జూన్ 12.
టెట్ కార్యాలయం టెలిఫోన్ నంబర్: 7075701763/ 64
డొమైన్ సంబంధిత సమస్యల కోసం హెల్ప్‌డెస్క్ నంబర్: 7075701768/ 84
సాంకేతిక సంబంధిత సమస్యల కోసం హెల్ప్‌డెస్క్ నంబర్: 7032901383
తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలలో యూజీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు
తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలలో యూజీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు
మిలిటరీ ఎడ్యుకేషన్, త్రివిధ దళాల్లో ఉద్యోగ కల్పనే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి(బీబీనగర్)లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌ను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రత్యేకంగా ప్రారంభించింది. ఈ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం యూజీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్) కోర్సుల్లో సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కోర్సు వివరాలు:
1. యూజీ కోర్సులు (బీఎస్సీ- ఎంపీసీ/ ఎంఎస్‌సీఎస్/ బీజడ్‌సీ/ ఎంజడ్‌సీ; బీకాం కంప్యూటర్స్/ బీఏ హెచ్‌ఈపీ): 240 సీట్లు
2. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ- ఎకనామిక్స్ కోర్సు: 40 సీట్లు
బోధనా మాధ్యమం: ఆంగ్ల మాధ్యమం.
సంస్థ పేరు: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, భువనగిరి/ బీబీనగర్, యాదాద్రి భువనగిరి జిల్లా.
అర్హత: 2023-24లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. ఎత్తు కనీసం 152 సెం.మీ ఉండాలి. వయసు 16- 18 ఏళ్ల మధ్య ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్ (ఫిజికల్ టెస్ట్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్, సైకో అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్), మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 15.04.2024.
హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 27.04.2024.
స్టేజ్-I రాత పరీక్ష తేదీ: 06.05.2024.
స్టేజ్-II స్క్రీనింగ్ టెస్ట్ తేదీలు: 24, 25, 27, 28, 29, 30, 31.05.2024, 01.06.2024.
కానిస్టేబుల్ పరీక్ష కీ విడుదల ఎప్పుడంటే?
కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ నియామక రాత పరీక్ష (CBT) ప్రాథమిక కీ విడుదలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) సన్నాహాలు చేస్తోంది. ప్రాథమిక కీ(Preliminary Key)ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అనంతరం కీపై అభ్యంతరాలు స్వీకరించి ఏప్రిల్ చివర లేదా మే నెలలో తుది కీతో పాటు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆన్‌లైన్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ట్రైనీ ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏప్రిల్ 13వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
* ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్): 7 పోస్టులు
అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (13.04.2024 నాటికి): 27 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.40,000 - 1,40,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 13.04.2024.