కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకానికి తాజా, పునరుద్ధరణ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 30 వరకు ఉందని ఇంటర్ బోర్డు ప్రకటిం చింది.
ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
దరఖాస్తుల కోసం 2020-21లో ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఇంతకు ముందు జాతీయ స్కాలర్‌షిప్ కోసం ఎంపికైన విద్యార్థులు 2021-22 విద్యాసంవత్సరానికి దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
తాజా, పునరుద్ధరణ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.
విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. తాత్కాలికంగా ఎంపికైన విద్యార్థుల 81,594 మంది జాబితా వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వివరించారు.
No comments:
Post a Comment