మొత్తం ఖాళీలు: 450 (అన్ రిజర్వ్‌డ్-227, ఓబీసీ-121, ఎస్సీ-67, ఎస్టీ-35)
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55శాతం)
వయోపరిమితి: జనవరి1,
2018 నాటికి కనిష్టంగా 20, గరిష్టంగా 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు,
ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు
ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా
ఆన్‌లైన్ పరీక్ష విధానం :
రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 50
ప్రశ్నల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నలు
ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఐబీపీఎస్ నిర్వహించే ఈ పరీక్షలో సెక్షన్లవారీ
కటాఫ్‌లు, నెగిటివ్ మార్కులు(ప్రతి తప్పుకు 1/4 నెగిటివ్ మార్కులు)
ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు.
- ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ
ఉంటుంది. ఉన్న ఖాళీలకు మూడు రెట్లు అధికంగా అభ్యర్థులను జీడీ,
ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. జీడీ (50), ఇంటర్వ్యూ(50)లు రెండూ 100
మార్కులకు ఉంటాయి. ఆన్‌లైన్ పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూల వెయిటేజీ 50:20:30 గా
ఉంటుంది.
ప్రిపరేషన్ విధానం...
రీజనింగ్: నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు సైతం సులభంగా
చేయొచ్చు. కోడింగ్- డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డెరైక్షన్స్, సీటింగ్
అరేంజ్‌మెంట్, సిలాజిజమ్, ఫజిల్ టెస్ట్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, డేటా
సఫిషియన్సీ, స్టేట్‌మెంట్-అజమ్షన్స్, ఆర్గుమెంట్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్,
ఇన్‌ఫరెన్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్
టెస్ట్‌లు రెండింటిలోనూ ఈ విభాగం ఉంది. రీడింగ్ కాంప్రహెన్షన్, ఫైండింగ్
ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్స్, రీ అరేంజ్‌మెంట్
ఆఫ్ సెంటెన్సెస్, క్లోజ్‌టెస్ట్, సిననిమ్స్, యాంటనిమ్స్ నుంచి ఆబ్జెక్టివ్
ప్రశ్నలుంటాయి. ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్‌పై డిస్క్రిప్టివ్ టెస్ట్
ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ గట్టెక్కాలంటే.. రైటింగ్ స్కిల్స్‌పై
పట్టుండాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్,
నంబర్ సిరీస్, డేటా సఫిషియన్సీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్, డేటా
ఇంటర్‌ప్రిటేషన్ నుంచి ప్రశ్నలుంటాయి. అర్థమెటిక్‌లో రేషియో, పర్సంటేజి,
టైమ్-వర్క్, పర్మ్యుటేషన్స్, ప్రాబబిలిటీ తదితర అంశాలు ముఖ్యమైనవి. డేటా
ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 20-25 ప్రశ్నలుంటాయి. కాలిక్యులేషన్స్ వేగంగా
చేయగలిగితే సులభంగా విజయం సాధించవచ్చు.
జనరల్ అవేర్‌నెస్: బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థ, ఆర్‌బీఐ,
కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్టాక్‌మార్కెట్, వ్యక్తులు, పుస్తకాలు, రచయితలు,
అవార్డులు, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లోని వర్తమాన అంశాలకు
చెందిన ప్రశ్నలుంటాయి.
పీజీడీబీఎఫ్ కోర్సు :
ఆన్‌లైన్ పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన
అభ్యర్థులు మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్-బెంగళూరు లేదా ఎన్‌ఐటీటీఈ
ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్-మంగుళూరుల్లో ఏదో ఒకచోట ఏడాది పాటు పోస్టు
గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సు
చదవాల్సి ఉంటుంది. మణిపాల్‌ను ఎంచుకున్న అభ్యర్థులు వసతి, భోజనం, కోర్సు,
ఇతర అన్నీ రకాల ఫీజులు కలుపుకుని రూ. 4.13 లక్షలు, ఎన్‌ఐటీటీఈను ఎంచుకున్న
వారు రూ.3.54 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని తక్కువ వడ్డీతో లోన్
సదుపాయం కల్పిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత సులభ పద్ధతిలో వాయిదాల ద్వారా
చె ల్లించవచ్చు. ఈ ఏడాది శిక్షణలో 9 నెలలు క్లాస్‌రూం టీచింగ్, చివరి మూడు
నెలలు ఏదైనా కెనరా బ్యాంక్ శాఖలో ఇంటర్న్‌షిప్ చేయాలి. విజయవంతంగా కోర్సు
పూర్తిచేసిన తర్వాత ఐదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగు తామని ఒప్పంద పత్రం
సమర్పించాలి. మధ్యలో వైదొలిగితే లోన్ తీసుకున్న ఫీజుతో పాటు అదనంగా రూ.లక్ష
చెల్లించాలి. విధుల్లో చేరిన తర్వాత రూ.23,700 బేసిక్ శాలరీతో పాటు డీఏ,
హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తయిన
తర్వాత శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఐదేళ్ల సర్వీసును పూర్తిచేసుకున్న
ఉద్యోగులకు ఏడాదికి కొంత మొత్తం చొప్పున పదేళ్ల సర్వీసు పూర్తయ్యే లోపు
కోర్సు ప్రారంభంలో చెల్లించిన ఫీజును తిరిగి ఇచ్చేస్తారు.
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: జనవరి 9, 2018
దరఖాస్తుల చివరి తేదీ: జనవరి 31, 2018
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118, మిగిలిన అందరికీ రూ.708 (జీఎస్టీతో కలిపి)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
పరీక్ష తేదీ: మార్చి 4, 2018
కాల్ లెటర్లు: ఫిబ్రవరి 20 తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
పరీక్ష కేంద్రాలు: ఏపీ-చీరాల,
చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు,
రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.canarabank.com