Friday, 24 November 2017

ఏపీ, తెలంగాణ పోస్టల్ సర్కిళ్లలో 317 ఉద్యోగాలు

ఏపీ, తెలంగాణ పోస్టల్ సర్కిళ్లలో 317 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లో 190, తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 127.. మొత్తం 317 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రెండు వేర్వేరు ప్రకటనలు వెలువడ్డాయి.
Jobsవీటి ద్వారా తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లోని ఖమ్మం డివిజన్ (భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం) పరిధి హెచ్‌వో, ఎస్‌వోల్లో ఉన్న ఖాళీలను; ఏపీ పోస్టల్ సర్కిల్‌లోని ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం డివిజన్ల పరిధిలోని వివిధ హెచ్‌వో, ఎస్‌వోల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు.
పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మెయిల్ క్యారియర్).
అర్హతలు: పదో తరగతితో పాటు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. పదో తరగతి లేదా అంతకన్నా ఎక్కువ విద్య (ఇంటర్మీడియెట్/డిగ్రీ/..)లో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపు ఉంటుంది.
వయసు: 2017, నవంబర్ 20 నాటికి 18-40 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఓసీ/ఓబీసీ అభ్యర్థులకు రూ.100; మిగిలిన అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 19, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.indiapost.gov.in, www.appost.in/gdsonline

No comments:

Post a Comment