Saturday 21 October 2017

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ టీచ‌ర్ 8792 పోస్టులు

టీఆర్టీ: 5415 ఎస్‌జీటీ, 1941 ఎస్ఏ, 1011 ఎల్‌పీ, 416 పీఈటీ పోస్టులు
         తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ) ద్వారా 8792 పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. వీటిలో 5415 సెకెండ‌రీ గ్రేడ్ టీచ‌ర్‌, 1941 స్కూల్ అసిస్టెంట్‌, 1011 లాంగ్వేజ్ పండిట్‌, 416 ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్, 9 స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌) పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీల భ‌ర్తీకి వ‌చ్చే ఏడాది ఫిబ్రవ‌రి రెండో వారంలో ప‌రీక్షలు నిర్వహిస్తారు. అన్ని ప‌రీక్షలూ ఆబ్జెక్టివ్ త‌రహాలోనే ఉంటాయి. అయితే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఏ విధానంలోనైనా ప‌రీక్షలు ఉండ‌వ‌చ్చు.
వ‌యోప‌రిమితి:
ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నప్పటికీ జులై 1, 2017 నాటికి క‌నిష్ఠంగా 18 ఏళ్లు గ‌రిష్ఠంగా 44 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు అయిదేళ్లు; దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
విద్యార్హత‌లు:
ఎస్‌జీటీ పోస్టుల‌కు: ఇంట‌ర్‌లో క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే క‌నీసం 45 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. దీంతోపాటు రెండేళ్ల డీఎడ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
ఎస్ఏ పోస్టుల‌కు: స‌ంబంధిత విభాగంలో క‌నీసం 50 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే క‌నీసం 45 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. దీంతోపాటు ద‌ర‌ఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించి బీఎడ్ కోర్సులో మెథ‌డాలజీ పూర్తిచేసిన‌వారై ఉండాలి.
ఎల్‌పీ పోస్టుల‌కు: స‌ంబంధిత భాష‌ను డిగ్రీలో ఒక స‌బ్జెక్టుగా చ‌దివుండాలి. లేదా సంబంధిత భాష‌లో పీజీ పూర్తిచేయాలి. క‌నీసం 50 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే క‌నీసం 45 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. దీంతోపాటు ద‌ర‌ఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించి బీఎడ్ కోర్సులో మెథ‌డాలజీ పూర్తిచేసిన‌వారై ఉండాలి లేదా సంబంధిత భాష‌లో పండిట్ ట్రైనింగ్ పూర్తిచేసిన‌వారై ఉండాలి.
పీఈటీ: క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ పూర్తిచేసిన‌వారై ఉండాలి. దీంతోపాటు డిప్లొమా ఇన్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ లేదా బ్యాచిల‌ర్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌): ఈ పోస్టుల‌కు క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన‌వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే క‌నీసం 45 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. అలాగే బ్యాచిల‌ర్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
పై అన్ని పోస్టుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ప్రారంభం: అక్టోబ‌రు 30, 2017
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 30, 2017
హాల్ టికెట్లు: ప‌రీక్షకు వారం రోజుల ముందు నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ఆయా విభాగాల‌వారీ , జిల్లాల‌వారీ, స‌బ్జెక్టుల‌వారీ ఖాళీల వివ‌రాలు సంబంధిత ప్రకట‌న‌ల్లో ల‌భిస్తాయి.

నోటిఫికేష‌న్లు:

ఎస్‌జీటీ
http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/dsc/documents/SGT-2017.pdf
ఎస్ఏ
http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/dsc/documents/SA-2017.pdf
ఎల్‌పీ
http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/dsc/documents/LP-2017.pdf
పీఈటీ
http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/dsc/documents/PET-2017.pdf
పీఈటీ(ఎస్ఏ)
http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/dsc/documents/SA(pet)-2017.pdf

వెబ్‌సైట్: https://tspsc.gov.in

No comments:

Post a Comment