Friday, 27 May 2016
Monday, 23 May 2016
37,500 మంది ఉద్యోగులు..........
కొత్త జిల్లాలకు 37,500 మంది ఉద్యోగులు
- డిప్యూటీ కలెక్టర్లకు కలెక్టర్లుగా పదోన్నతులు
- జిల్లాల్లో 41 శాఖల ఏర్పాటుకు యోచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం
కొత్తగా ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాలకు 37,500 ఉద్యోగులు అవసరమవుతారని
అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్లు, శాఖాధిపతులను వీరికి అదనం.
రాష్ట్రంలో ఐఎఎస్‌ల కొరత ఉన్నందున డిప్యూటీ కలెక్టర్లకు కలెక్టర్లుగా
పదోన్నతి కల్పించనున్నారు. డీఆర్‌ఓలుగా పని చేస్తున్న వారికి సీనియార్టీ
ప్రాతిపదికన ప్రమోటీ ఐఎఎస్‌లుగా పదోన్నతి కల్పించనున్నట్టు తెలుస్తోంది. 8
మండలాలకు ఒక ఆర్డీఓను నియమించాల్సి ఉన్నందున కొందరు సీనియర్ తహసీల్దార్లకు
ఆర్డీఓలుగా ప్రమోషన్ కల్పించనున్నారు. 15 జిల్లాలకు ఒకేసారి ఇంతమంది
సిబ్బందిని సమకూర్చడం సాధ్యం కాకుంటే ఇప్పుడున్న పది జిల్లాల్లో పని
చేస్తున్న సిబ్బందిలో కొంతమందిని కొత్త జిల్లాలకు బదిలీ చేసే అవకా శాన్ని
కూడా అధికారుల పరిశీలిస్తున్నారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రె
సిడెన్షియల్ ఆర్డర్ లేనందున పాత జిల్లాల్లో పని చేస్తున్న సిబ్బందిని
కొత్త జిల్లాలకు బదిలీ చేసే అవకాశం ఉందా? లేదా? అన్న మీ మాంశలో అధికారులు
ఉన్నారు.
జిల్లాకు 2500 మంది ఉద్యోగులు
పాలన
సౌలభ్యం కోసం ఒక్కో జిల్లాలో 2500 మంది సిబ్బంది, శాఖాధిపతులతో పాటు ఇతర
అధికారులను నియమిం చనున్నారు. రాష్ట్రంలో ప్రసుత్తం 41 శాఖలున్నాయి. ఆయా
శాఖలకు ఒక శాఖాధిపతి ఉన్నారు. అదే తరహాలో జిల్లా కేంద్రంలో కూడా 41 శాఖలను
ఏర్పా టు చేసి అక్కడే శాఖాధిపతులను నియమిస్తే పను లు సులువుగా సాగుతాయని
ప్రభుత్వం భావిస్తోంది. అయితే అంతమంది శాఖాధిపతును నియామకాలు చేపట్టేందుకు
ఆయా శాఖల్లో పని చేస్తున్న కింది స్థాయి అధికారులకు ప్రమోషన్ కల్పించాలని
ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల సుమారు వెయ్యి మందికి
ఉద్యోగులకు పదోన్నతి లభించను న్నట్టు తెలిసింది. అదేతరహాల్లో డిప్యూటీ
కలెక్టర్లు, డీఆర్ఓలు, ఎమ్మార్వోలు కూడా పదోన్నతి పొందనున్నారు.
ఉద్యోగులకు ఆప్షన్స్
కొత్త
జిల్లాల్లో సిబ్బంది కొరత రాకుండా ఉండేందుకు ఇప్పుడున్న పది జిల్లాల్లో
పని చేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలి సింది.
ఉదాహరణకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం లో పని చేస్తున్న ఉద్యోగికి కొత్తగా
ఏర్పాటు చేయబోయే వనపర్తికి వెళ్తారా? లేకా ఇతర జిల్లాల్లో పని చేస్తారా?
అన్న విషయం పై ఆ ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. సదరు ఉద్యోగి
వనపర్తి జిల్లాలో పని చేస్తా నంటే వనపర్తికి బదిలీ చేస్తారు. ఇలా పది
జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఇదే పద్దతిన కొత్త జిల్లాలకు
కేటాయింపులు జరపనున్నట్టు తెలిసింది.
ఉద్యోగుల్లో ఆందోళన
ప్రెసిడెన్షియల్
ఆర్డర్ లేకుండానే రాష్ట్ర సర్కార్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నది.
ప్రభుత్వం కల్పించే ఆప్షన్ సౌకర్యంతో కొత్త జిల్లాలకు వెళ్లితే సర్వీస్
రూల్స్, సీనియార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళనలో ఉద్యోగులు
ఉన్నారు. అయితే ప్రభుత్వమే బదిలీ చేస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు
రాకపోవచ్చని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా కేంద్రంలో అవసరమైన హెచ్ఓడీలు.. ఉద్యోగులు
-
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇద్దరు
డిప్యూటీ కలెక్టర్లతో పాటు 100 మంది ఉద్యోగులు, సిబ్బందిని నియమించాల్సి
ఉంది
- జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ, ఓఎస్డీతో పాటు 50 మంది
- ఆర్ఐఓలు 5
- ఆర్డీఓలు 10
- విద్యా శాఖ కార్యాలయంలో డీఈఓతో పాటు 30 మంది ఉద్యోగులు
- అర్ధ గణాంక శాస్త్రంలో 16
- జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 20
- ఆర్జేడీ కార్యాలయంలో 3 జాయింట్ డైరెక్టర్లతో పాటు 45 మంది ఉద్యోగులు
- వ్యవసాయ కార్యాలయంలో ఒక జాయింట్ డైరెక్టర్‌తో పాటు 15 మంది ఉద్యోగులు
- జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 15
- ఏసీబీ కార్యాలయంలో 40
- వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎమ్హె చ్ఓతో పాటు 20 మంది ఉద్యోగులు
- ఎక్సైజ్ కార్యాలయంలో 25
- టీబీ కంట్రోల్ కార్యాలయంలో 40
- కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో డీసీటీఓతో పాటు 15 మంది ఉద్యోగులు
- జిల్లా యూత్‌వెల్ఫేర్ కార్యాలయంలో 5
- ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్యాలయాల్లో 200
- మైనార్టీ శాఖ కార్యాలయంలో 30
- సంక్షేమ శాఖల కార్పొరేషన్లలో 100
- మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రాజెక్టు డైరెక్టర్‌తో పాటు 45 మంది ఉద్యోగులు
- జిల్లా విద్యా శాఖలో డీఈఓతో పాటు 40 మంది ఉద్యోగులు
- ఇవేగాకా ఆయా శాఖలో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లను నియమించాల్సిఉన్నది.
ఈ లెక్కన చూస్తే జిల్లా మొత్తంలో 2500 మంది ఉద్యోగులు అవసరమవుతారని ప్రభుత్వం అంచనాలు వేస్తున్నది.
Sunday, 22 May 2016
Thursday, 19 May 2016
Bookings ........... avilable online.
Brahmotsavam
- Telugu
- Family Entertainment
| Director | : | Srikanth Addala | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Cast | : | Mahesh Babu, Kajal Agarwal, Pranitha Subhash, Samantha Ruth Prabhu, Sathyaraj, Jayasudha | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Producer | : | Prasad V Potluri | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Music | : | Mickey J Meyar | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Release Date | : | 20 May 2016 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| An drama Brahmostavam is directed by Srikanth Addala. Mahesh Babu,Kajal Agarwal, Pranitha Subhash, Samantha Ruth Prabhu, Sathyaraj, Jayasudha in the lead roles.http://www.ticketnew.com/Brahmotsavam-Telugu-Movie-Tickets-Online-Booking-Show-Timings/Release-Date/11752 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Wednesday, 18 May 2016
ఆభరణాలను ప్రదర్శనకు పెడితే............?
** ఇక గోల్డ్ టూరిజమ్ **
పర్యాటకులు భారత్‌కు తాజ్‌మహల్ చూడటానికి వస్తారు. రెడ్ ఫోర్ట్ చూడటానికి వస్తారు. తిరుమల వేంకటేశ్వరుణ్ణి, మధుర మీనాక్షిని చూడటానికి వస్తారు. ఇక మీదట దేవుని ఆభరణాలను చూడటానికి వస్తే? దేశంలో ప్రస్తుతం 25000 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఒక అంచనా. ఇందులో ఐదు శాతం బంగారం మన గుడులలోనే ఉందట. ఈ బంగారం ఇవాళ్టిది నిన్నటిది కాదు. వందల ఏళ్లుగా భక్తులు ఆయా దేవుళ్లకు సమర్పించిన కానుకల్లో భాగంగా సురక్షితంగా ఉంది. పాతకాలం నాటి ఆ ఆభరణాలు, వాటి నైపుణ్యం, అందం, విలువ దర్శించడం కూడా ఒక విడ్డూరంగా ఉంటుంది.
ఉదాహరణకు తిరువనంతపురంలో నిక్షిప్తమైన విలువైన ఆభరణాలను ప్రదర్శనకు పెడితే ఈ దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి దర్శించరూ? అందుకే ప్రపంచంలో ఏ దేశానికీ లేని ఈ వెసులుబాటును భారత్ పరిశీలిస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తే కనుక దేవుని ఆభరణాలు ప్రదర్శనకు పెట్టవచ్చనే ఆలోచనతో ఈ రెండూ ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదొక విధానంగా అయితే మాత్రం దేవుడు ధరించే ఆభరణాలకు నమస్కారం పెట్టుకోవడానికి భక్తులు క్యూ కడతారనడంలో ఆశ్చర్యం లేదు.
మహిళా భద్రతకు శక్తివంతమైన సాధనం!
వినియోగదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నపుడు, వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లకు అత్యవసర సందేశాలను పంపించేందుకు వీలుగా ఈ కొత్త సేఫ్టీ యాప్ పనిచేస్తుంది. మొబైల్ స్క్రీన్ పై ఒక్కసారి టాప్ చేస్తే చాలు.. కుటుంబ సభ్యులు, ఇతర అత్యవసర కాంటాక్ట్ నెంబర్లకు సమాచారం నిమిషాల్లో అందిపోతుంది. కాంటాక్ట్ నెంబర్ తో పాటుగా వారి లొకేషన్ ను కూడ ముందుగా షేర్ చేస్తే... అత్యవసర పరిస్థితుల్లో వారున్న ప్రదేశాన్ని సైతం గుర్తించేట్టుగా కార్బన్ మొబైల్ కొత్త ఫీచర్ ను అందిస్తోంది.
తాజా సదుపాయంతో వినియోగదారులు అలర్ట్స్ మాత్రమే కాక అలారం మోగించే అవకాశాన్ని కూడ కల్పిస్తోంది. మొబైల్ స్క్నీన్ లాక్ ను అన్ లాక్ చేయకుండా మొబైల్ ను షేక్ చేస్తూ, పవర్ బటన్ ను నొక్కుతుంటే చాలు... అలర్ట్స్ తో పాటు, అలారం కూడ అందే సదుపాయం కార్బన్ కొత్త ఫీచర్ ద్వారా పరిచయం చేస్తోంది. 2017 జనవరి 1 నుంచి మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా పానిక్ బటన్ ఇన్ స్టాల్ చేయాలన్న ప్రభుత్వ సూచనను కార్బన్ అమల్లోకి తెచ్చింది. దీనితోపాటు అన్నిఫోన్లలో జనవరి 2018 నాటికి తప్పనిసరిగా ఇన్ బిల్ట్ జీపీఎస్ నేవిగేషన్ సిస్టమ్ ఉండాలని కూడ ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ సూచనలను హ్యండ్ సెట్ ఇండస్ట్రీ బాడీ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) కూడ స్వాగతించింది.
99 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ...................?
99 రూపాయలకే స్మార్ట్ ఫోన్
Others | Updated: May 18, 2016 16:41 (IST)
తమ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారు నమోటెల్. డాట్‌కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడి, పాస్‌వర్డ్‌ను పొందాలన్నారు. ఇందులో లాగిన్ అయ్యాక ఆన్‌లైన్ రూపంలో నగదు చెల్లించాలి. ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడి అందుతుంది. వాటి ఆధారంగా నమోటెల్ డాట్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోటో, ఆధార్‌కార్డును జతచేస్తే స్మార్ట్‌ఫోన్ ను అందిస్తామన్నారు. బి మై బ్యాంకర్‌లో సభ్యుడిగా చేరితే మాత్రమే నోవాటెల్‌లో రిజిస్ట్రేషన్ సాధ్యమన్నారు. బ్లాక్ అండ్ వైట్ రెండు రంగుల్లో అందుబాటులోకి రానున్న ఈ మొబైల్ ధరను 2వేల రూపాయలను తగ్గించినట్టు ప్రకటించింది. కంపెనీ క్యాష్ ఆన్ డెలీవరీ సదుపాయం కూడా కల్పించినట్టు రెడ్డి చెప్పారు.
దీని ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
1.3 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
1 జీబీ రామ్ , 3జీ
4 జీబీ రామ్
3 మెగా పిక్సెల్ ఫ్రంట్, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
డ్యూయల్ సిమ్, 4 ఇంచ్ హెచ్ డీ డిస్ ప్లే
1325 ఎంఏహెచ్ బ్యాటరీ
మనుషులనే పెయింటింగ్ చిత్రాలుగా మారిస్తే.. .....
జిసైన్ మార్ వెడెల్ అనే ఓ చిత్రకారురాలు నగ్నంగా ఉన్న మనుషులను ఆయా జంతువులు, పక్షులు, కీటకాలు, సముద్ర ప్రాణిలా ఆకారంలో మలచడంతోపాటు ఆ మేరకు వారిపై రంగులు వేసి అబ్బురపరిచింది. ఇలా పురుషులు, స్త్రీలపైన దాదాపు పన్నెండు గంటలపాటు ఆమె కష్టపడి పెయింట్స్ వేసి అనంతరం ఆ పెయింట్స్ ను ఓ చక్కటి ఫొటోగ్రాఫర్ తో క్లిక్ మనిపించింది. ఆ ఫొటోలు చూసిన వారంత ఆశ్చర్యపోయారు. ఒక కళను ఇలా కూడా ప్రదర్శించడం సాధ్యమా అని అనుకుంటున్నారు.
తాను ఇలా మనుషులపైనే పెయింటింగ్ వేయాలని ఆలోచించడమే ఆశ్చర్యంకాగా.. అది కూడా అత్యంత అరుదైన అటవీ జంతువుల బొమ్మలే చిత్రించి వాటిపట్ల మనుషులు కాస్తంత ఉదారంగా ఆలోచించేలా చిత్రాలు వేయడం గొప్ప విషయం. కాగా ఈ పెయింటింగ్స్ వేస్తున్నంత సేపు వారు తమకు మసాజ్ చేస్తున్నట్లుగా ఫీలయ్యారంట.
Subscribe to:
Posts (Atom)

